టెక్నాలజీ : స్క్రీన్​ షాట్స్ ఏ ఫోన్ లో ఎలా?

ఫోన్​ వాడేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్​ విషయాన్ని షేర్ చేయాల్సివస్తే.. షేర్ ఆప్షన్ వాడడం ఒక పద్ధతి. అయితే అదే పని క్షణాల్లో అయిపోవాలంటే స్క్రీన్​ షాట్ తీస్తారు. చాలామంది ఈ ఆప్షన్​ని ఇప్పటికే వాడుతూనే ఉంటారు. ఆండ్రాయిడ్, శాంసంగ్​ గెలాక్సీ, ఐఒఎస్ లేదా ఐపాడ్​ ఫోన్​లలో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వేరువేరు పద్ధతులు ఉన్నాయి. అయితే, అవి అందరికీ తెలియాలనేం లేదు. కానీ,  ఫోన్ మార్చినా  కొత్త ఫోన్ కొన్నా ఆ ఆప్షన్ కోసం వెతుకుతుంటారు. అదెలాగంటే ...

శాంసంగ్ గెలాక్సీ

శాంసంగ్ గెలాక్సీలో స్క్రీన్ షాట్ తీయడం ఆండ్రాయిడ్​ ఫోన్ల కంటే భిన్నంగా ఉంటుంది. క్యాప్చర్ చేయాలనుకుంటున్న స్క్రీన్​ ఓపెన్ చేయాలి. పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ ఒకేసారి నొక్కాలి. కింద ఉన్న టూల్ బార్​లో డబుల్ డౌన్ యారో ఐకాన్​ని కిందకు ప్రెస్ చేయాలి. ఐకాన్​ మీద ప్రెస్ చేశాక, స్క్రీన్​ ఆటోమెటిక్​గా స్క్రోల్ అవుతుంది. దాంతో ఎంతవరకు క్యాప్చర్ చేయాలి అనుకుంటున్నారో  అంతవరకు లాగాలి. తర్వాత ఎడమవైపున ఉన్న ఇమేజ్​ థంబ్​నెయిల్​ మీద ట్యాప్ చేయాలి. ఫొటోస్ యాప్ లేదా గ్యాలరీ యాప్​లలో వాటిని చూడొచ్చు. ఫొటోస్ యాప్​లో అయితే ఎడిట్ ఐకాన్​ మీద ట్యాప్ చేసి ఇమేజ్​ని మోడిఫై చేసుకోవచ్చు. షేర్ చేయొచ్చు. గ్యాలరీ యాప్​లో అయితే పెన్సిల్ ఐకాన్​తో ఎడిట్ చేయొచ్చు. 

ఐఫోన్ లేదా ఐపాడ్

ఐఫోన్ లేదా ఐపాడ్​లలో స్క్రీన్ షాట్​ తీయాలంటే..ఐఒఎస్ 14, ఐపాడ్​ఒఎస్14 లేదా అంతకంటే ఎక్కువై ఉండాలి. వాటిలో ఈ ఫీచర్ వెబ్​ పేజ్, ఈ–మెయిల్ మెసేజ్, డాక్యుమెంట్లను క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇమేజ్​లాగ క్యాప్చర్ చేయడానికి బదులు పీడీఎఫ్​లా క్యాప్చర్ చేస్తుంది. 

క్యాప్చర్ స్క్రీన్ షాట్

టచ్​ ఐడీ ఉన్న ఐఫోన్​ లేదా ఐపాడ్, సైడ్ బటన్, హోమ్​ బటన్ నొక్కాలి. ఫేస్ ఐడీ అంటే సైడ్ బటన్, వాల్యూమ్ అప్ బటన్ నొక్కాలి. స్క్రీన్​ షాట్ వచ్చాక, థంబ్​నెయిల్ మీద ట్యాప్ చేయాలి. ఎడిటర్ విండోలో ఫుల్ పేజీ అనే దానిపై ట్యాప్ చేయాలి. స్క్రీన్​ షాట్​ మొత్తాన్ని చూడాలంటే.. చిన్న థంబ్​నెయిల్స్ ద్వారా కుడి నుంచి ట్యాప్ లేదా స్వైప్ చేయాలి. 

ఎడిట్

కావాలనుకుంటే టూల్ బార్ ఉపయోగించి.. డిఫరెంట్ పెన్, పెన్సిల్ టూల్స్ వాడి పీడీఎఫ్ కూడా చేయొచ్చు. ప్లస్ ఐకాన్​ మీద ట్యాప్ చేస్తే మెను కనిపిస్తుంది. దానిపై టెక్స్ట్​ లేదా సిగ్నేచర్ ఏదైనా హైలైట్ చేయొచ్చు. ఒపాసిటీ మార్చొచ్చు లేదా స్క్వేర్ లేదా వేరే సింబల్​ యాడ్ చేయొచ్చు. అలా చేసేటప్పుడు అన్​–డు లేదా రీ– డు కూడా చేయొచ్చు. 

డిలీట్​

స్క్రీన్​షాట్ డిలీట్ చేయాలనుకుంటే.. పైన ఉన్న ట్రాష్ ఐకాన్​ మీద ట్యాప్ చేయాలి. షేర్ చేయాలనుకుంటే షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాప్ ఎంచుకుని పర్సన్​కి సెండ్ చేయాలి. షేర్ అయ్యాక డన్​ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. స్ర్కీన్ షాట్​ని డిలీట్, కాపీ, పీడీఎఫ్​గా సేవ్ చేయొచ్చు. లేదా ఫైల్స్ యాప్ నుంచి ఆన్​లైన్ సర్వీస్ అంటే.. డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ డ్రైవ్, బాక్స్, మైక్రోసాఫ్ట్ ఒన్ డ్రైవ్ వంటివి వాటిల్లో స్టోర్ చేయొచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్​లో..

ఆండ్రాయిడ్ ఫోన్​లో స్క్రోలింగ్ స్క్రీన్​ షాట్​ చాలా వెర్సటైల్​గా ఉంటుంది. దాంతో ఏ స్క్రీన్​ అయినా స్క్రీన్ షాట్ తీయొచ్చు. హోం స్క్రీన్, వెబ్ పేజ్​, యాప్, డాక్యుమెంట్​ ఇలా ఏదైనా ఈజీగా తీయొచ్చు. ఒక స్టాండర్డ్​ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే అందులో స్క్రీన్​ షాట్​ తీయాలంటే.. స్క్రోలింగ్ స్క్రీన్​ ఏదైనా లేదా వెబ్​ పేజ్ ఓపెన్ చేసి, పవర్​ బటన్, వాల్యూమ్ బటన్ రెండింటినీ ఒకేసారి నొక్కాలి.

కింద ఉన్న టూల్​ బార్​లో క్యాప్చర్ మోర్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. అప్పుడు ఆ ఇమేజ్​కి సంబంధించిన స్క్రీన్ మొత్తం దాని చుట్టూ ఒక బాక్స్​తోపాటు కనపడుతుంది. ఇంకో స్క్రీన్​ కూడా యాడ్ చేయాలి అనుకుంటే.. ఎంతవరకు స్క్రీన్​ షాట్ తీయాలి అనుకుంటున్నారో అంతవరకు కింద ఉన్న హ్యాండిల్ సాయంతో లాగాలి (డ్రాగ్). తర్వాత సేవ్​ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. 

క్యాప్చర్ స్క్రీన్ షాట్

స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్​లు గూగుల్ ఫొటోస్ యాప్​లో స్క్రీన్​షాట్​ ఫోల్డర్​లో సేవ్ అవుతాయి. లేదా గ్యాలరీలో ఫొటోల్లో కనిపిస్తాయి. గూగుల్ ఫొటోల్లో వెతకాలంటే.. యాప్ ఓపెన్ చేసి లైబ్రరీ ఐకాన్​ మీద ట్యాప్ చేసి, స్క్రీన్​షాట్స్ థంబ్​నెయిల్ మీద ట్యాప్ చేయాలి. అప్పుడు స్క్రీన్​షాట్ ఓపెన్ అవుతుంది. కావాలంటే వాటికి ఎడిట్, క్రాప్, అడ్జెస్ట్​, మార్క్​, ఫిల్టర్స్ వాడొచ్చు. వాటిని వేరే వాళ్లకు షేర్ చేసేందుకు షేర్ ఐకాన్​ మీద ట్యాప్ చేయాలి. పర్సన్​ని ఎంచుకునేందుకు ఏ యాప్​లో షేర్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ ఓపెన్ చేసి షేర్ చేయాలి.