టెక్నాలజీ : వాట్సాప్ మెసేజ్, ​స్పామ్​ కాల్స్ పసిగట్టండి ఇలా..

వాట్సాప్ అనేది కేవలం చాట్​, వీడియోలు, ఫొటోలు పంపుకోవడం, వీడియో కాల్ మాట్లాడడం వంటివాటికి ఎక్కువగా వాడతారు. దాంతోపాటు ఫ్రెండ్స్​కి జోక్స్​ షేర్ చేయడం నుంచి ఆఫీస్​ డాక్యుమెంట్స్ వరకు.. ఎన్నో పనులకు ఉపయోగిస్తుంటారు. మరి అలాంటప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్​. అందుకే యూజర్లకు సేఫ్​ స్పేస్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆ కంపెనీ. మోసపూరితమైన లేదా అనుమానాస్పదమైన మెసేజ్​లకు అడ్డుకట్ట వేసేందుకు ట్రై చేస్తోంది.  స్పామ్ మెసేజ్ లేదా ఫోన్​ కాల్స్ వంటివి వస్తే వాట్సాప్ యూజర్ కాంటాక్ట్​లో ఆ నెంబర్​ లేకపోతే అది స్పామ్ అని తెలుసుకోవచ్చు. 

స్పామ్ మెసేజ్​ల్లో చాలావరకు పర్సనల్ లేదా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ట్రై చేస్తారు. లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి మోసాలు ఎప్పుడైనా, ఎవరికైనా జరగొచ్చు. కాబట్టి ఇలాంటి మోసాలను పసిగట్టి, యూజర్లను సేఫ్​ జోన్​లో ఉంచేందుకు వాట్సాప్ ఇచ్చే సూచనలు ఇవి.

పసిగట్టండి ఇలా..

  •     యూజర్లు  ఇలాంటి స్పామ్ కాల్స్, మెసేజ్​లకు చిక్కుకోకుండా ఉండాలంటే ఈ క్లూలు గుర్తుపెట్టుకోవాలి.
  •   గ్రామర్ లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి.
  •     లింక్​ మీద ట్యాప్ చేస్తే కొత్త ఫీచర్​ యాక్టివేట్ అవుతుందని చెప్తారు లేదా యాప్​ డౌన్​లోడ్ చేసుకోమంటారు.
  •     పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పమంటారు. అంటే.. క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్​, బర్త్ డేట్, పాస్​వర్డ్ వంటివి.
  •     మెసేజ్​ను ఫార్వార్డ్​ చేయమంటారు.
  •     డబ్బులు అడుగుతారు లేదా వాట్సాప్​ పే నుంచి డబ్బు కట్టమంటారు.
  •     లాటరీ, గ్యాంబ్లింగ్, జాబ్​, ఇన్వెస్ట్​మెంట్, లోన్ వంటి మెసేజ్​లు వస్తాయి.
  •     పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగకుండానే.. నమ్మకం కుదిరే వరకు చాట్ చేస్తుంటారు. 

కాంటాక్ట్స్​లో లేని నెంబర్​ నుంచి ఏదైనా మెసేజ్​ వస్తే.. దానికి ఎలా రెస్పాండ్​ అవ్వాలనేది మెసేజ్ మీద సిగ్నల్స్ చూపిస్తుంది వాట్సాప్. ఆ సిగ్నల్స్ ఏంటంటే.. యువర్ కాంటాక్ట్, గ్రూప్స్ ఇన్ కామన్, ఫోన్​ నెంబర్​ వేరే దేశంలో రిజిస్టర్ అయి ఉంటే దానికి సంబంధించిన సిగ్నల్ ఉంటుంది. అప్పుడు వాళ్లను కాంటాక్ట్​లో యాడ్ చేయాలో, బ్లాక్ లేదా రిపోర్ట్ చేయాలో డిసైడ్ అవ్వొచ్చు.

మెసేజ్​ వచ్చినప్పుడు సౌండ్ అనుమానించే విధంగా ఉంటే.. ట్యాప్ లేదా షేర్ లేదా ఫార్వార్డ్ చేయొద్దు. ఒకవేళ అలాంటి స్పామ్ మెసేజ్​లు వస్తే.. ముందు ఆ లింక్ దేని గురించో చూడాలి. అది చట్టబద్ధమైనదిగా కనిపించినా స్పామ్ అనిపిస్తే దాన్ని ఓపెన్ చేయొద్దు. హెల్ప్​ సెంటర్​లో అనుమానంగా ఉన్న ఫైల్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి.

అలాగే ఎవరి నుంచి ఆ మెసేజ్ వచ్చిందో తెలియకపోతే దాన్ని ఫార్వార్డ్ చేయొద్దు. దానివల్ల తప్పుడు సమాచారం ఎక్కువమందికి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. 
ఒకవేళ అది తెలిసిన వాళ్ల నెంబర్ అయితే ఆ విషయం కన్ఫర్మ్ చేసుకునేందుకు పర్సనల్ క్వశ్చన్స్ లేదా ఐడెంటిటీ వంటివి అడగాలి. ఇంకా నమ్మకం కుదరకపోతే వాయిస్ లేదా వీడియో కాల్ చేయమని అడగాలి.

ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఆ నెంబర్​ని రిపోర్ట్ లేదా బ్లాక్ చేస్తే సరిపోతుంది. తర్వాత మెసేజ్​ను డిలీట్ చేయాలి. వాట్సాప్​ వాడడానికి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్రీ యాప్ అని గుర్తుపెట్టుకోవాలి.