టెక్నాలజీ : వాట్సాప్​లోనే కాదు..ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​లో కూడా లొకేషన్ షేర్ చేయొచ్చు

వాట్సాప్​లోనే కాదు... ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​లో కూడా లొకేషన్ షేర్ చేయొచ్చు. గంట వరకు లైవ్​ లొకేషన్ ఆన్​లో ఉంటుంది. లొకేషన్ రీచ్​ అయ్యాక డిఫాల్ట్​గా ఆఫ్​ అవుతుంది. డైరెక్ట్​ మెసేజ్​లో ప్రైవేట్​గా మాత్రమే షేర్ అవుతుంది. షేరింగ్ లొకేషన్ చాట్​లో ఉన్న ఇద్దరికీ కనిపిస్తుంది. ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కుదరదు. ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ లొకేషన్​ షేరింగ్ ప్రోగ్రెస్​లో ఉందని చాట్ పైన ఒక గుర్తు కనిపిస్తుంటుంది. 

యూజర్లు నచ్చిన టైంలో లొకేషన్ షేరింగ్​ని ఎండ్​ చేయొచ్చు కూడా. అంతేకాదు, ఈ ఫీచర్​తో కాన్సర్ట్​లు, క్రికెట్​మ్యాచ్​లు, సభలు వంటి ప్రదేశాల్లో మీ ఫ్రెండ్స్​ లేదా ఫ్యామిలీ పర్సన్స్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు మ్యాప్​లో ఒక లొకేషన్ పిన్​ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.