Good Idea : నెగెటివ్ ఎమోషన్స్ తగ్గాలంటే థ్యాంక్స్ చెప్పండి.. రిలాక్స్ అవుతారు..!

ఎవరైనా సాయం చేసినప్పుడు 'థ్యాంక్స్' చెప్పడం సంస్కారం. అప్పటికప్పుడు వీలుకాకపోతే కృతజ్ఞత భావంతో ఉంటూనే.... సమయం దొరికినప్పుడు రుణం తీర్చుకోవాలి. అయితే ఆ పనిలో తెలియని ఆనందం ఉంటుంది. అది మనసుకు ఉల్లాసాన్ని పంచడంతో పాటు ఆయుష్షును కూడా పెంచుతుంది. మనిషిలో ఒక పాజిటివ్ ఫీలింగ్ కంటే బాధ, కోపం లాంటి నెగెటివ్ ఎమోషన్స్ కు  బలం ఎక్కువ. ఇవి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, స్ధిరత్వంగా 'కృతజ్ఞత' అనే
భావనను కొనసాగించాలి. అప్పుడే నెగెటివ్ ఎమోషన్స్ ఓడిపోతాయి.

 సోషల్ లైఫ్ సాఫీగా సాగడంతో పాటు కంటి నిండా నిద్ర, బంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒత్తిడి నుంచి కూడా బయటపడొచ్చని అధ్యయనాలు నిరూపించాయి. భయం, ఆవేశంతో పాటు శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. కొందరిలో భావోద్వేగాల కారణంగా కృతజ్ఞతలు చెప్పేందుకు కూడా వెనకాడుతుంటారు. అలాంటప్పుడు రాతపూర్వకంగా ఎదుటివారికి ఓ లేఖ రాసి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుచుకోవచ్చు.