మీ వాట్సాప్ వెబ్ కు లాక్ వేసుకోవచ్చు.. అది ఎలాగో తెలుసా..!

 ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్ ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్ డేట్ తో వినియోగదారులకు మరింత చేరువవుతుంది. తాజాగా వాట్సాప్  తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ వెబ్ ఫీచర్ ను తెచ్చిన కంపెనీ తాజాగా వాట్సాప్‌ వెబ్ లో గోప్యత కోసం వెబ్ లాక్ అనే  కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. 

దీంతో వినియోగదారులు వాట్సాప్ వెబ్ చాట్ ను ఎదుటివారికి కనిపించకుండా జాగ్రత్త పడవచ్చు.  వారు ఎవరితో చాట్ చేస్తున్నారో.. ఏం చేస్తున్నారో కనిపించకుండా లాక్ వేసుకునే ఫీచర్ ను తెచ్చింది. అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.  

ముందుగా.. 
1. వెబ్‌లో మీ వాట్సాప్ ప్రొఫైల్‌కు లాగిన్ చేయండి.
2. హోమ్ పేజీలో  ఉన్న మూడు చుక్కల మెనుపై క్లిక్ చేయండి.
3. మెను నుండి సెట్టింగ్స్ ఎంచుకుని ప్రైవసీ సెట్టింగ్స్ కు వెళ్లండి.
4. ప్రైవసీ సెట్టింగ్స్ లో యాప్ లాక్ లోకి వెళ్లండి.
5. మీ పాస్‌వర్డ్‌ని సెట్ చేసి.. దాన్ని మళ్లీ నిర్ధారించండి.
6. మీరు ఎంతసేపు అవతలి వ్యక్తుల వాట్సాప్ ప్రొఫైల్ లాక్ చేయాలనుకుంటున్నారో సమయాన్ని  ఎంచుకోండి.
ఈ విధంగా మీరు WhatsApp వెబ్‌లో యాప్ లాక్‌ని సెట్ చేసుకోవచ్చు మరియు మీ గోప్యతను కాపాడుకోవచ్చు.