కశ్మీరు లోయలో..
కాశ్మీర్ అందాలకే కాదు భౌగోళిక వైవిధ్యానికీ చిరునామా, ఆ వైవిధ్యంలో చెట్లు కొండలపై సుదూరమైన లోయలను చూసే అవకాశం స్పితి వ్యాలీ, మంచు దుప్పటి కప్పుకుని ఉండే హిమాలయాల్లో ఇప్పుడు అది కరిగి ప్రవహిస్తోంది. ఈ వేసవి పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవనంతో ముచ్చట్లతోపాటు పర్వత ప్రాంత విహారాలు, సాహస యాత్రలు చేసేందుకు ఉబలాటపడే వారికి ఇదే మంచి అవకాశం.
టిబెట్, లడాక్ ప్రాంతాలకు సమీపంలో ఉంది. ఆ ప్రాంతాలకు పోయే పర్యాటకులు ఇక్కడ కూడా పర్యటించేందుకు మరి కొన్ని రోజులు కేటాయించుకోవచ్చు. స్పితి వ్యాలీ పర్యటనతోపాటు ఆయా ప్రాంతాలనూ చూసి రావచ్చు. ఈ ప్రాంత పర్యాటకానికి సొంతంగా వసతి సదుపాయాలను ప్రాంతాలకు సమీపంలో వెదుక్కోవడం కొంచెం కష్టం. ప్రయాణ సదుపాయాలు కూడా అనుకూలంగా ఉండవు. స్థానికంగా ట్రావెల్ ఏజెన్సీల సహకారంతో వెళ్తే సమయం, డబ్బు వృథాకావు...
స్పితి అంటే నడిమధ్యలో అని అర్థం. ఇండియా, టిబెట్ దేశాల మధ్య ఉన్న హిమాలయ భూభాగం ఇది. అందుకే ఈ లోయకు స్పితివ్యాలీ అనే పేరు వచ్చింది. హిమాలయ పర్వత శ్రేణులలో చాలా ఎత్తయిన ప్రాంతం కూడా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ వ్యాలీలో ప్రయాణం ఓ సాహసం. పర్వతాలపై ట్రెక్కింగ్లోనే కాదు. రోడ్డు మార్గంలోనూ ఇక్కడ సాహస యాత్ర చేయాల్సిందే! తొలచిన రాతి పర్వతపు అంచులే అక్కడ రహదారులు, ఏటవాలు పర్వతాలకు సొరంగం తీసినట్లుగా తొలిచిన ఈ రోడ్లపై ప్రయాణం ఒళ్లు గగుర్పొడుస్తుంది. నిత్యం ఈ మార్గాలలో ప్రయాణించే ట్రక్కులు, యాత్రికుల వాహనాలు, స్థానికుల ప్రయాణాలు చూస్తుంటే భయమే కాదు ఒక గొప్ప అనుభవం కూడా.
ఇంకెక్కడా ఇలాంటి ప్రయాణాన్ని చూడలేం. ఈ వ్యాలీలోని మంచు అందాలను, అందమైన లోయలను చూడాలంటే సాహసం చేయాలి. కొండవాగ్రు)లు.. అక్కడక్కడ ఊళ్లు సిృతి వ్యాలీలో బౌద్ధ మత ప్రభావం ఎక్కువ. వజ్రయాన బౌద్ధానికి సంబంధించిన కట్టడాలు ఈ పర్వత ప్రాంతాల్లో చూడొచ్చు. హిమాలయాలు శైవాలయాలకు ప్రసిద్ధని ప్రత్యేకంగా చెప్పేదేముంది. అక్కడక్కడ ఆధ్యాత్మిక క్షేత్రాలుండే మంచు భూమిలో ఎత్తయిన కొండలు, ఆ కొండల మధ్య ఉండే లోయలు చూడముచ్చటగా ఉంటాయి. స్పితి వ్యాలీ ఏడాది పొడవునా అత్యంత శీలంగా ఉండే ప్రాంతం, శీతాకాలంలో పూర్తిగా మంచు ఎడారిలా మారిపోతుంది. అందువల్లనే ఈ లోయల్లో చెట్లు పెరగవు. పచ్చదనం లేని లోటున్నా విశాలమైన మంచు ఎడారి మనోహరంగా కనిపిస్తుంది.
వేసవిలో సుదూరంగా ఉన్న కొండ ప్రాంతాలు కనిపిస్తాయి. ఈ వేసవిలోనూ మిట్ట మధ్యాహ్నం రెండు, మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందక్కడ. శిఖరాలపై కరిగిన మంచు చిన్న చిన్న ప్రవాహాలుగా కొండవాలులో ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాలన్నీ కలిసి పర్వత పాదాలకింద పెద్ద ప్రవాహాలుగా కనిపిస్తాయి. ఈ ప్రవాహాలన్నీ కలిసి ఏర్పడిందే స్వితి నది. ఈ నది పక్కన అక్కడక్కడా జనావాసాలుంటాయి. ఆ జనావాసాలను ఆసరా చేసుకుని ఆధ్యాత్మిక క్షేత్రాలుంటాయి. పర్యాటకుల కోసం ఈ ప్రాంతాలను కలుపుతూ రోడ్లుంటాయి. శీతాకాలంలో వెళ్లే ప్రయాణికులు మందుపై ట్రెక్కింగ్ చేయాల్సింది. ఈ అందమైన లోయల్ని చుట్టి రావాలంటే ఇదే అనుకూల సమయం. ఇప్పుడు అన్ని ప్రాంతాలను కలుపుతూ ఉండే రోడ్లు ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈ సీజన్లో స్పితి వ్యాలీ చూడదగిన ప్రదేశం.
కీ గొంపా..కొండపై
సముద్ర మట్టానికి 4,166 అడుగుల ఎత్తున ఉన్నదీ కొండ. ఈ కొండపై, కొండవాలు పై నిర్మించిన ఈ ఇళ్లను చూస్తుంటే చిన్నపట్టణం అనిపిస్తుంది కదా. కానీ కాదు. ఇదో రెసిడెన్ష యల్ విద్యా సంస్థ. దాని పేరు కీ గొంపాలి. బౌద్ధ మత గురువులకు శిక్షణ ఇస్తారిక్కడ. స్పితి వ్యాలీలో బౌద్ధమత శిక్షణా కేంద్రాలలో ఇది అతి పెద్దది. క్రీ.శ. 10వ శతాబ్దంలో ఇది ప్రారం భించారు. మంగోలుల దాడులు, భూకంపాలు, మంచు తుఫానులు తట్టుకుని నిలిచిన ఆధ్యా త్మిక చరిత్రకు ఇది సాక్షి, ఇక్కడ పర్యాటకులు బౌద్ధమత విశ్వాసాలు, విశేషాలు, బౌద్ధుల చరిత్రను తెలుసుకోవచ్చు. పద్నాలుగో శతాబ్దం నాటి గోడ (కుడు) చిత్రాలు ఆకట్టుకుంటాయి.
ప్రాచీన బడి!
స్పితి వ్యాలీలోని స్పితి నదీ ప్రవాహానికి సమీపంలో ఉన్నటలో గ్రామంలో ఈ బౌద్ధం మత శిక్షణా కేంద్రం ఉంది. దీనిని క్రీ. శ. 996లో ప్రారంభించారు. ప్రపంచంలో ఉన్న ప్రాచీన బౌద్ధ మత విద్యా సంస్థల్లో ఇది అత్యంత ప్రాచీన మైనది.