టెక్నాలజీ : మ్యూట్ బ్రౌజర్ .. ఇక నుంచి ఈ టిప్​ ఫాలో అయిపోండి?

సిస్టమ్​లో లేదా లాప్​ ట్యాప్​లో ఏదైనా ఒక వెబ్​ సైట్ ఓపెన్ చేసి ఆర్టికల్/ న్యూస్ చదువుతున్నప్పుడు మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్​ ఉండకూడదు. అలా డిస్టర్బ్ అయితే చదివే దానిపై ఆసక్తి కోల్పోవడం సహజం. అయితే, కొన్ని వెబ్​ సైట్​లు ఓపెన్ చేస్తే ఆటోమెటిక్​గా యాడ్​ వీడియోనో, ఆడియోనో ప్లే అవుతూ ఉంటుంది.

 అలాంటప్పుడు కాన్సన్​ట్రేషన్​ దెబ్బతినొద్దంటే.. వెంటనే బ్రౌజర్ ట్యాబ్​ మీద రైట్​ క్లిక్​ చేయాలి. డ్రాప్​ డౌన్ మెనూలో మ్యూట్ ట్యాబ్​ లేదా మ్యూట్ సూట్ అనే ఆప్షన్​ను ఎంచుకుంటే సరి. ఎలాంటి సౌండ్స్​ వినిపించవు. కొన్ని బ్రౌజర్లలో ట్యాబ్ మీద మైక్రోఫోన్​ ఆప్షన్​ కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే సౌండ్ ఆగిపోతుంది. ఇక నుంచి ఈ టిప్​ ఫాలో అయిపోండి.