Yoga Day 2024 : యోగాను అలవాటు చేసుకోండి.. లైఫ్ ను హెల్దీగా.. హ్యాపీగా ఉంచుకోండి..!

కొన్ని అలవాట్లు జీవన శైలిని ఆరోగ్యవంతంగా చేస్తాయి. వాటిల్లో కొన్నింటి ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ సాధించొచ్చు. అలాంటి యాక్టివిటీస్లో 'ది బెస్ట్ ఎక్సర్ సైజ్'గా యోగాకి పేరుంది. శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా అందిస్తుంది. ఆ గొప్పతనమే దానికొక ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కేలా చేసింది. అందుకే యోగాని అలవాటుగా చేసుకుంటే లైఫ్ మరింత హెల్దీగా, హ్యాపీగా ఉంటుంది.

యోగా  ఇది కేవలం ఫిజికల్ ఫిట్ నెస్ పై మాత్రమే ప్రభావం చూపించదు. ఇంటర్నల్ బాడీశరీరం లోపల) పనితీరుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ను పెంచడంతో పాటు రక్తప్రసరణ సజావుగా సాగేలా చూస్తుంది. తద్వారా సరాల లోపల ఏదైనా అడ్డుపడితే తొలగిపోయి... గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. యోగా వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలేంటో చూద్దాం..

ప్రశాంతతకు 

శరీరానికి, మెదడుకు మధ్య ఉన్న బంధాన్ని దృఢంగా ఉంచడానికి యోగా ఎంతగానో ఉపయోగాపడుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి. ఇది స్టడీ ద్వారా తేలింది కూడా. యోగా వల్ల ప్రైమరీ సైస్ హార్మోన్ పై ప్రభావం పడుతుందని.. తద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలింది. అయితే యోగా వల్ల డిప్రెషన్ ఎలా దూరం అవుతుందనే విషయం పై సైంటిస్లు సరైన కారణాలు చెప్పలేకపోయారు. ప్రశాంతమైన జీవన శైలి కోరుకునేవాళ్లకు యోగా అసరాగా నిలుస్తోందని చెబుతున్నారు సైంటిస్ట్లు. 

రోగ నిరోధక శక్తి

యోగాలోని కొన్ని రకాల ఎక్సర్సైజులు, ఆసనాలు చేయడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి నియంత్రణలో ఉంటుంది. శరీరంలో లింఫ్ నోడ్స్ (శోషరస నాళాలు) నుంచి స్రావాలు ఎక్కువగా విడుదలవుతాయి. దీంట్లో రోగనిరోధక కణాలు (ఇమ్యూనిటీ సెల్స్) ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్లు, జబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడతాయి. ఈ రకంగా యోగా ఆరోగ్యవంతమైన శరీరాన్ని అందిస్తుంది.

ముందు చూపు

వయసు పైబడినవాళ్ల ఎముకల్లో క్యాల్షియం తగ్గి కీళ్ల వ్యాధులు.. నాడీకణాలు బలహీనం అయ్యి " మతిమరుపు సమస్యలు వస్తుంటాయి. యోగా వల్ల కండరాలు, ఎముకలు గట్టి పడ్తాయ్. దాంతో ఎముకలు విరగడం, ఇతర సమస్యలు రావు. మెదడు సామర్థ్యం పెరుగుతుంది. మతిమరుపు సమస్యకు దూరంగా ఉండొచ్చు. 

బీపీ తగ్గుతుంది.

శ్వాస సంబంధిత వ్యాధుల్ని యోగా తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ (బీపీ)ని నియంత్రిస్తుంది. రెగ్యులర్ యోగా చేయడం ద్వారా శరీరం మొత్తం రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఆక్సిజన్ తో కూడిన రక్తం శరీరంలో అన్ని అవయవాలకు అందుతుంది. దాంతో రక్తపోటు సమస్య తీరుతుంది. ఒత్తిడి వల్ల కలిగే రక్తపోటుని కూడా తగ్గిస్తుంది యోగా, శ్వాస వ్యవస్థ సజావుగా సాగడానికి తోడ్పడుతుంది.

బరువు తగ్గుతుంది.  

తిన్న తిండి సరిగ్గా అరగాలి. అందుకు జీర్ణక్రియకు సంబంధించిన హార్మోను ఉత్పత్తి. కావాలి. యోగా ఆ హార్మోన్లు ఉత్పత్తి కావడంలో సాయపడుతుంది. అంతేకాదు పేగులపై ఒత్తిడి పెరిగి జీర్ణక్రియ వ్యవస్థను సజావుగా జరిగేలా చేస్తుంది. దానివల్ల మలబద్ధకం సమస్య తీరుతుంది. ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. అలాంటప్పుడు మామూలు స్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది యోగా, అంతేకాదు అధిక బరువు సమస్య తీర్చి.. అథ్లెటిక్ బాడీని అందిస్తుంది.