ఆహా ఏమి రుచి : పిల్లలు ఎంత ఇష్టంగా.. ఫ్రాంకీ తిందామా..

చిన్నపిల్లల నుంచి పెద్దోళ్లదాకా అందరూ ఇష్టంగా తినే ఫుడ్ ఫ్రాంకీ. అందరి హాట్ ఫేవరెట్ రెసిపీని ఇంట్లోనే చేసుకోవచ్చు. వాటిలో ఒక వెరైటీ బెలెపెప్పర్ (క్యాప్సికమ్) ఫ్రాంకీ. దాన్ని ఎలా తయారు చేయాలంటే.. 

కావాల్సినవి..

  • మైదా- ఒక కప్పు 
  • గోధుమపిండి- ఒక కప్పు 
  • కొత్తిమీర- కొద్దిగా
  • గరం మసాలా- ఒక టీ స్పూన్
  • అల్లం- వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్
  • ఉల్లిగడ్డ తరుగు- ఒక టీ స్పూన్
  • క్యాబేజీ తురుము- ఒక కప్పు 
  • క్యారెట్ తురుము- ఒక కప్పు 
  • నూనె- నాలుగు టీ స్పూన్లు
  • క్యాప్సికమ్ ముక్కలు- ఒక కప్పు 
  • కారం- రుచికి సరిపడా
  • ఉప్పు - తగినంత 
  • పావుబాజీ పౌడర్- రెండు టీ స్పూన్లు
  • ధనియాల పొడి - ఒక టీ స్పూన్ 
  • టొమాటో సాస్- ఒక టీ స్పూన్ 
  • నిమ్మరసం- ఒక టీ స్పూన్ 

తయారీ..

ఒక గిన్నెలో మైదాపిండి, గోధుమపిండి, ఉప్పు, నూనె వేయాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. పాన్ పెట్టి నూనె వేడి చేశాక వెల్లుల్లి, ఉల్లిగడ్డ. అల్లంవెల్లుల్లి. పేస్ట్, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ వేయాలి. తర్వాత అందులో టొమాటో పేస్ట్, పావుబాజీ పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి.

చివరిగా నిమ్మరసం పిండి మరోసారి కలపాలి. తిందామా పెట్టుకున్నపిండితో చపాతీలు చేసి టొమాటో కావాల్సినవి మైదా - ఒక కప్పు గోధుమపిండి - ఒక కప్పు కొత్తిమీర - కొద్దిగా గరం మసాలా - ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్ ఉల్లిగడ్డతరుగు - ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి - నాలుగు రెబ్బలు క్యాబేజీ తురుము - ఒక కప్పు క్యారెట్ తురుము - ఒక కప్పు నూనె - నాలుగు టీ స్పూన్లు క్యాప్సికమ్ ముక్కలు - ఒక కప్పు కారం - రుచికి సరిపడా సాస్ రాసి ఫ్రై చేసిన కర్రీ పెట్టి రోల్ చేయాలి. యమ్మీయమ్మీ బెల్ పెపర్ ఫ్రాంకీ రెడీ..