Video Viral: ఓరేయ్ ... ఏం ఛాయ్​ రా .. ఇది తాగితే డైరక్ట్​గా పరలోకానికే..

జనాలకు పిచ్చి పీక్​ స్టేజీకి చేరిపోయింది. జనాలు తమ గురించే చర్చించుకోవాలని... సోషల్​ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. మనలో కొంతమందికి టీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ స్ట్రీట్​ వ్యాపారి తయారు చేసిన టీ ని తాగితే డైరక్ట్​ గా పరలోకానికే  పయనం అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. 

మనలో కొంతమందికి టీ అంటే చాలా ఇష్టం.ఇక వారికి ఎలాంటి పనుల్లో విసిగి వచ్చిన లేదా తలనొప్పిగా అనిపించినా ముందుగా వారికి గుర్తు వచ్చేది టీ తాగడం. అయితే వివిధ రకాలుగా టీ చేయడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అంతేకాకుండా సోషల్ మీడియాలో అనేక రకాలుగా వంటలు చేయడం, స్నాక్స్ చేయడం లాంటివి ఈ మధ్య వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాము.. 

ఒక వ్యక్తి టీ చేసే విధానాన్ని చూసి టి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి టీ తయారు చేసేందుకు అన్ని సిద్ధంగా ఉంచుకొని ముందుగా స్టవ్ పై టీ పాత్రను పెట్టి అందులో టీ పొడి ,పాలు, చక్కెర వేస్తాడు. బాగా మరిగిన తరువాత అందులో ఎనర్జీ డ్రింగ్​ స్టింగ్​ కలుపుతాడు. ఆ తరువాత కూడా బాగా మరిగించి టీ గిన్నెను రెండు.. మూడు సార్లు తీసి స్టవ్​ పెట్టి.. బాగా కలిపి  వేడి చేస్తాడు.  ఆ తరువాత టీని గ్లాసుల్లో వడపోస్తూ కొద్దిగా ఖాళీ ఉంచి అందులో మళ్లీ స్టింగ్​ కలిపి సర్వ్​ చేస్తాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sandesh Bora (@f4foodi)

ఈ వింత వంటకాన్ని ఎలా తయారు చేస్తారో చూస్తేమాత్రం అవాక్ అవుతారు. మీరు కూడా టీ ప్రియులైతే, ఈ వీడియో చూసిన తరువాత మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు. ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే..!ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ పేజీ f4foodi ద్వారా షేర్ చేశారు. ఈ టీని ఇప్పటివరకు ( వార్త రాసే సమయానికి)  31 లక్షల మందికి పైగా నెటిజన్లు చూశారు. చాలా మంది దీనికి ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు.

ఇక ఈ వీడియో చుసిన అనేకమంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి విషపు టీ ని చేసిన అతనిని కఠినంగా శిక్షించబడాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు. మరొకరు, ఈ టీలో ఇంకా కాస్త కొత్తగా హార్పిక్ ను కలపండి పీడ పోతుంది అంటూ కాస్త టీ ప్రియులు ఆగ్రహంగా స్పందిస్తున్నారు.