సాధారణంగా పూరీ వేయించాలంటే నూనె అవసరం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు, వృద్ధులు పూరీని తినలేరు. అయితే నూనె చుక్క లేకుండా పూరిని చేయొచ్చు.ఆ నూనెకి బదులు నీళ్లు వాడొచచు. నమ్మసక్యంగా లేదా..? అయితే.. నూనె లేకుండా.. పూరీ ఎలా చేసేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. .
అల్పాహారం లేదా రాత్రి భోజనంలో పూరీని తినడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. తినడానికి రుచికరంగా ఉన్నా, నూనెలో వేయించి తింటే శరీరానికి హానికరం. నూనెలో వేయించినందున మధుమేహ వ్యాధిగ్రస్తులు, హృద్రోగులు, వృద్ధులు తినలేరు. అయితే ఇకపై అలాంటి చింత అవసరం లేదు. ఎంచక్కగా నీళ్లతో పూరీలను తయారు చేసుకోవచ్చు.
సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ లలో చాలా మందికి పూరీ అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. కానీ ఎంత ఇష్టం ఉన్నా.. ఆయిల్ ఫుడ్ కదా.. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే భయంతో పూరీని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ... ఆయిల్ వేయించినా పూరీకి వచ్చే రుచి మరే బ్రేక్ ఫాస్ట్ కి రాదనే చెప్పాలి. అయితే.. చుక్క నూనె కూడా వాడకుండా మనం పూరీలను ఇంట్లో తయారు చేయవచ్చు. ఆ నూనెకి బదులు నీళ్లు వాడొచచు. నమ్మసక్యంగా లేదా..? అయితే.. నూనె లేకుండా.. పూరీలను తయారు చేసుకోవచ్చు..
ముందుగా.. మనం ఎప్పటిలాగా పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. కలుపుకనే సమయంలో కొద్దిగా ఉప్పు, వాము వేసుకోవాలి. పిండి కలిపిన తర్వాత.. 15 నిమిషాలపాటు పక్కన పెట్టాలి. అలా పక్కన పెట్టేటప్పుడు కలిపి ఉంచుకున్న పిండిపై ఓ తడి క్లాత్ కప్పి ఉంచాలి.ఇలా పక్కన పెట్టిన తర్వాత.... 15 నుంచి 20 నిమిషాల తర్వాత.. పిండి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ లోగా ముందుగానే ఎయిర్ ఫ్రయ్యర్ ని ప్రీ హీట్ చేసుకోని ఉంచుకోవాలి. 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ప్రీ హీట్ చేసి ఉంచుకోవాలి.
తర్వాత చిన్న ఉండలుగా చేసుకున్న పిండిని.. పూరీలు ఒత్తుకున్నట్లు ఒత్తుకోవాలి. రోలర్ తో.. అన్నింటినీ పూరీల్లా చేసుకోవాలి. మరోవైపు ఒక ప్యాన్ తీసుకొని దానిలో వాటర్ పోయాలి. నీరు వేడిగా అయిన తర్వాత.. ఆ నీల్లలో ఈ పూరీలన్నంటినీ వేయాలి. ఒక నిమిషం పాటు నీళ్లలో వాటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు నీళ్లలో వేగిన ఈ పూరీలను నీరు లేకుండా తీయాలి. తీసిన వాటిని ఎయిర్ ఫ్రయ్యర్ లో ఉంచాలి. ఎయిర్ ఫ్రయ్యర్ బాస్కెట్ లో ఉంచిన తర్వాత.. 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయిస్తే.. వేడి వేడిగా పొంగే పూరీలు రెడీ అయిపోతాయి.
నూనె లేకుండా పూరీ చేసే మరో విధానం..
మీరు పూరీని ఆవిరి మీద ఉడికించి, పాన్‌లో పఫ్ చేయడం ద్వారా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఎయిర్ ఫ్రైయర్‌లో తయారుచేసిన పూరీలా గోధుమ రంగులో ఉండదు. అయితే నూనె లేకుండా కూడా మంచి రుచిగా ఉంటుంది. దీనికోసం ఏం చేయాలంటే..
పూరీ కోసం పిండిని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఓ పది నిమిషాల తరువాత పిండిని మళ్లీ మెత్తగా చేసి చిన్న బంతులుగా చుట్టుకుని పూరీలు వత్తుకోండి. ఇప్పుడు స్టీమర్‌లో నీటిని వేడి చేసి, పూరీలను ఒక ప్లేట్‌లో ఉంచి 2 నుంచి 3 నిమిషాలు ఆవిరిలో ఉంచండి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ ను మీడియం హీట్ మీద వేడి చేయండి. పాన్ వేడిగా ఉన్నప్పుడు దానిపై ఆవిరి పూరీని వేయండి. 30నుంచి 40 సెకన్ల పాటు ఒక వైపు ఉడికించాలి.
బుడగలు ఒక వైపు కనిపించడం ప్రారంభించినప్పుడు, దాన్ని తిప్పండి. ఒక గరిటెలాంటి సహాయంతో అంచులను తేలికగా నొక్కండి. పుల్కా చేసినట్టుగా దానిని చదునుగా ఒత్తుకోవాలి. రెండు వైపులా కొద్దిగా నెయ్యి రాసి, పూరీని బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే నూనె లేని పూరీ రెడీ అవుతుంది. దీన్ని ఒక ప్లేట్‌లో తీసుకుని మీకు నచ్చిన కూర వడ్డించుకుని తినేయండి.
నాన్ స్టిక్ పాన్ మీద పూరీని తయారుచేసేటప్పుడు ఈ చిట్కాలను గుర్తుంచుకోండి
పూరీని తయారు చేయడానికి ముందు పాన్ బాగా వేడి చేయడం ముఖ్యం. అలాగని దాని నుండి పొగ రాకుండా చూసుకోండి లేకపోతే పూరీ అంటుకుంటుంది. పూరీలు పొంగకపోతే, వాటిని గరిటెతో సున్నితంగా నొక్కడం లేదా తరచుగా తిప్పడం చేయండి. ఇప్పుడు అదే విధంగా పూరీని ఇంట్లో తయారు చేసి చూడండి.
ఇంకో విధానం.. . . .
0% ఆయిల్ ఫ్రీ పూరీ చేయడం ఎలా..? పూరీకి మామూలుగా పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి మృదువుగా మారిన తర్వాత.. చిన్న ఉండలు చేసుకోవాలి. అనంతరం పూరీలను గుడ్రంగా ఒత్తుకోవాలి. ఇడ్లీ ప్లేట్‌ను మూతపెట్టి 7 నుండి 8 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత తీసి ప్లేట్‌లో ఉంచి చల్లారనివ్వాలి.చల్లారిన తర్వాత, పూరీలను ఒక్కొక్కటిగా ఎయిర్ ఫ్రైయర్‌లో ఉంచి, మూత మూసివేసి… సుమారు 100°C వద్ద 30 సెకన్ల పాటు ఉడికించాలి. 30 సెకన్ల తర్వాత తీసుకుంటే నూనెలో వేయించిన పూరీకి అంతే టేస్ట్ వస్తుంది.
ఇలా చేస్తే చుక్క నూనె కూడా అవసరం లేకుండా.. పూరీ రెడీ అయిపోతుంది. అయితే ఇలా సిద్ధం చేసుకున్న పూరీలో ఒక చుక్క నెయ్యి వేసి ఎంచెక్కా తినొచ్చు.చుక్క నూనె కూడా లేకుండా తయారు చేసిన ఈ పూరీలను మనం.. మనకు నచ్చిన కూరతో ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ నూనె లేని పూరీలను ట్రై చేయండి.