కొక్కొరోకో కోడికూర: చిల్లీ చికెన్, చికెన్ బాల్స్ ఇంట్లోనే 20 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోవచ్చు..!

ఎలా వండుకున్నా టేస్టీగా ఉండే మాంసాహార వంటల్లో చికెన్ ఫస్ట్ ప్లేస్. చికెన్ ప్రేమికులైతే.. చికెన్ ఎలా వండినా.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అందుకే.. మీకోసం ఈ వారం చికెన్ వెరైటీలు తెచ్చినం. ఏందీ.. నోట్లో నీళ్లూరుతున్నాయా..? ఇంకా లేటెందుకు వంట మొదలుపెట్టేయండి మరి..!

బోన్ లెస్ చిల్లీ చికెన్ తయారీ విధానం:

కావాల్సిన పదార్థాలు: బోన్ లెస్ చికెన్ 350 గ్రా, కార్న్ ఫ్లోర్: అరకప్పు గుడ్డు : ఒకటి, వెల్లుల్లి పేస్ట్ : అరటీస్పూన్ అల్లం పేస్ట్ : అర టీస్పూన్, నూనె : తగినంత ఉప్పు: తగినంత, ఉల్లిగడ్డలు : ఒక కప్పు (తరిగినవి)సోయాసాస్ : ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి : రెండు
వెనిగర్ : రెండు టేబుల్ స్పూన్లు, నీళ్లు: తగినంత

ఇలా చేయాలి

ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, గుడ్డు, నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. చిన్నముక్కలు కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడిచేయాలి. వేడెక్కిన నూనెలో ఈ మిశ్రమంలో కలిపిన చికెన్ ముక్కలు వేయాలి. డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన ముక్కలను టిష్యూ పేపర్ మీద వేయాలి. ఇలా వేస్తే.. ముక్కకు పట్టుకున్ననూ నెను టిష్యూ పేపర్లు పీల్చుకుంటాయి. ఆ తర్వాత చికెన్ డీప్ ఫ్రై చేయాలి. ఒక పాన్ మీద పెట్టి రెండు టేబుల్స్పూవ నూనె వేడిచేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డలు వేగాక అందులోనే సోయాసాస్, వెనిగర్, అల్లం పేస్ట్ ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేయాలి. గ్రేవీ కావాలనుకుంటే.. కాస్త నీళ్లు పోసి కాసేపు సన్నని మంట మీద ఉంచాలి. దింపేముందు కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

చికెన్ బాల్స్ తయారీ విధానం:

కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా : పావుకిలో పచ్చిమిర్చి- నాలుగు ఉప్పు : తగినంత చిల్లీసాస్ : రెండు టీస్పూన్లు కార్న్ ఫ్లోర్ : ఒక టేబుల్ స్పూన్ మైదా: ఒక టేబుల్ స్పూన్ నూనె: వేగించడానికి సరిపడా ఇలా చేయాలి. 

ఇలా చేయాలి: 

చికెన్ కీమాలో కార్న్ ఫ్లోర్, మైదా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు చిల్లీసాస్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పులియబెట్టాలి. కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి కాగుతున్న నూనెలో చికెన్ బాల్స్ వేసి ఎర్రగా వేగించాలి. ఉల్లిగడ్డ ముక్కలు నంజుకుంటూ... సాస్లో ముంచి తింటే... చికెన్ బాల్స్ భలేగుంటయ్.

.. వెలుగు లైఫ్