ఒకవేళ ఫోన్ హ్యాక్ అయితే, వెంటనే ఫార్మాట్ చేయాలి లేదా ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌లో అయినా చేయొచ్చు. అయితే, ఆ టైంలో పొరపాటున కూడా ఫోన్ బ్యాకప్ తీయొద్దు. ఎందుకంటే బ్యాకప్‌తోపాటు మాల్వేర్ కూడా ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇంతకీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందనేందుకు ఇవే సంకేతాలు.
- ఫోన్ స్లోగా పనిచేస్తుంది.
- ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉన్నా, వాడటంలో ఇబ్బందులు వస్తాయి.
- డాటా విపరీతంగా అయిపోతుంటుంది.
- ఆటోమెటిక్‌గా ఫోన్ షట్ డౌన్ అయిపోవడం లేదా ఆటోమెటిక్‌గా రీస్టార్ట్ అవుతుంటే.. మీ ఫోన్‌ను హ్యాకర్ ఆపరేట్ చేస్తున్నట్టే.
- ఫోన్ సెట్టింగ్స్, యాప్స్ ఆటోమెటిక్‌గా మారుతుంటే మీ ఫోన్ ఆల్రెడీ హ్యాకర్ల చేతికి చిక్కినట్టే.
- బ్యాటరీ ఒక్కసారిగా డ్రెయిన్ అయిపోతున్నా కూడా హ్యాక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే హ్యాక్ అయ్యాక చాలా మాల్వేర్, యాప్, డాటాను ప్రాసెస్ చేస్తారు హ్యాకర్లు. కాబట్టి బ్యాటరీ ఎక్కువ వాడతారు.