iPhone: మీ ఐఫోన్ ఒరిజినలా.. ? లేక నకిలీదా.. తెలుసుకోవాలని ఉందా?.. జస్ట్ డూ ఇట్

ఐఫోన్..యూత్, ప్రొఫెషనల్స్ మంచి క్రేజ్ ఉన్న స్మార్ట్ ఫోన్.. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్. చాలామంది సెలబ్రీటీ లు కొత్త కొత్త ఐఫోన్లు చూస్తుంటాం..ఐఫోన్లు ప్రీమియం డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. 2024 క్వార్టర్లీ రిపోర్టుల ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా 39 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు అమ్ముడయ్యాయంటే..ఈ స్మార్ట్ ఫోన్ కు ఉన్న  క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది.  అయితే ఇటీవల కాలంలో ఐఫోన్ తక్కువ ధరకే దొరుకుతున్నాయి అని ప్రచా రం జరుగుతోంది. ఫేక్ ఐఫోన్లు  మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. ఫేక్ ఐఫోన్లతో అమాయక కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు.. అయితే ఫేక్ ఐఫోన్లను ఎలా గుర్తించాలి?

ఫేక్ ఐఫోన్లు మంచి డిజైన్లు, UI  ఇంటర్ ఫేస్  లతో సేమ్ టు సేమ్ ఒరిజనల్ ఐఫోన్ మాదిరిగానే కనిపిస్తాయి.  మీరు ఐఫోన్ కొనేటప్పడు ప్రత్యేకించి గమనించాలి. లేకుండా మీరు మోసపోతారు. ఫేక్ ఐఫోన్లు కొన్నప్పుడు ఉన్న పనితీరు తర్వాత ఉండదు.. తరుచుగా రిపేర్లు వస్తుంటాయి.

ఫేక్ ఐఫోన్లను గుర్తించండిలా.. 

ఐఫోన్లను కొనేటప్పుడు, ఆల్ రెడీ కొన్న ఐఫోన్లు ఒరిజినలా.. కాదా అనేది తెలుసుకునేందుకు ఈ పద్దతులను ఉపయోగించి తెలుసుకోవచ్చు. 

ప్యాకింగ్ పై దృష్టి పెట్టండి.. 

అసలు ఐఫోన్ ప్యాకేజింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఐఫోన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు అందులో ఉంటాయి. దీనితో పాటు  బాక్స్‌లో బార్ కోడ్ , క్యూఆర్ కోడ్ ఉంటాయి. వీటి ద్వారా మీరు నిజమైన లేదా నకిలీ ఉత్పత్తిని గుర్తించవచ్చు. బాక్సులో బార్ కోడ్ లేదా QR కోడ్ లేనట్లయితే ఐఫోన్ నకిలీ అని చెప్పొచ్చు. 

సీరియల్ నంబర్ , IMEI నంబర్‌ చెక్ చేయాలి..

సీరియల్ నంబర్,  IMEI నంబర్లను తప్పకుండా చెక్ చేసుకోవాలి.. ఐఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి  జనరల్ జనరల్ ఆప్షన్ కి నొక్కి ఖాతా సెలక్ట్  చేసుకోవాలి. ఇందులో ఐఫోన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఉంటాయి. Apple Check కవరేజ్ వెబ్ సైట్ కి వెళ్లి సీరియల్ నంబర్ కరెక్టా కాదా చెక్ చేయాలి. 

IMEI నంబర్‌ను తెలుసుకోవాలంటే.. మీ ఐఫోన్ నుంచి #06# డయల్ చేయాలి. IMEI నంబర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ IMEI నంబర్‌ని బాక్స్‌పై వ్రాసిన IMEI నంబర్‌తో పోల్చుకొని మ్యాచ్ అయితే ఒరిజినల్ అని అర్థం.

iOS తో సాఫ్ట్‌వేర్‌ను చెకింగ్..

iOSని చెక్ చేయడానికి, మీరు సెట్టింగ్‌లలో జనరల్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అందులో సాఫ్ట్‌వేర్ అప్డేట్ల  గురించి పూర్తి సమాచారం ఉంటుంది. Siriకి కమాండ్‌లు ఇవ్వడం ద్వారా మీ పరికరం నకిలీదా లేదా నిజమైనదా అని కూడా మీరు గుర్తించవచ్చు. హే సిరి కమాండ్ ఇవ్వండి, సిరి ప్రతిస్పందిస్తే పరికరం నిజమైనదని అర్థం. సిరి స్పందించకపోతే మీ ఐఫోన్ ఫేక్ అయ్యే అవకాశం ఉంది.

యాప్ స్టోర్‌ని చెక్ చేయడం ద్వారా.. 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో కస్టమర్లు గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ పొందినట్లే..ఐఫోన్లలో కూడా యాప్ స్టోర్ ఉంటుంది. మీ ఐఫోన్ లో యాప్ స్టోర్ లేకుంటే మీ ఐఫోన్ నకిలీదని అర్థం. ఇది కాకుండా మీరు Apple అధికారిక స్టోర్‌ను సందర్శించడం ద్వారా మీ ఐఫోన్‌ను కూడా తనిఖీ చేయవచ్చు.