ఎక్కువ నీళ్లున్న కొబ్బరి బోండం గుర్తించడం ఎలా అంటే... 

బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల్లో వేడి తట్టుకోవాలంటే.. రోజూ కొబ్బరి నీళ్లు మన బాడీలో పడాల్సిందే. అప్పుడే... మన బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది, అయితే... చాలా మంది చేసే ఫిర్యాదు ఏంటంటే.. కొబ్బరి బోండంలో నీళ్లు తక్కువగా ఉన్నాయి అనేస్తూ ఉంటారు. అయితే.. నీళ్లు ఎక్కువ ఉన్న కొబ్బరి బోండం మనమే సెలక్ట్ చేసుకోవచ్చు. అసలు.. నీళ్లు ఎక్కువగా ఉన్న బోండాన్ని ఎలా గుర్తించాలో ఓసారి చూద్దాం..


వేసవిలో మండే వేడిలో, చల్లటి కొబ్బరి నీళ్లను తాగడం కంటే ఉల్లాసాన్ని కలిగించేది మరొకటి ఉండదు. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో డిమాండ్ పెరుగుతుంది. దురదృష్టవశాత్తు, ధరలలో పెరుగుదల వస్తుంది. అధిక ధర ట్యాగ్‌లు ఉన్నప్పటికీ, నీటి కంటెంట్ పరంగా మీరు తగినంత మొత్తాన్ని పొందుతారనే గ్యారెంటీ లేదు. కాబట్టి, మీరు ప్రతిసారీ తాజా , అత్యంత హైడ్రేటింగ్ కొబ్బరి నీటిని పొందాలంటే ఏం చేయాలి..? ఈ కింది ట్రిక్స్ తో తెలుసుకోవచ్చు.

సమ్మర్​  వచ్చిందంటే చాలు, కొబ్బరి బోండాం బండి ఎక్కడ కనబడితే అక్కడ ఆగిపోతుంటాం. సమ్మర్‌లో అందరూ ఇష్టపడి తాగే న్యాచురల్ డ్రింక్ ఇది. ఎండా కాలంలో కొబ్బరి నీళ్లు తాగితే రిఫ్రెషింగ్‌గా, కడుపు చల్లగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు తాగితే.. డీహైడ్రేషన్‌, ఎండ వేడిని తగ్గడమే కాదు.. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది, బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేస్తాయి. దీనిలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది, ఇది జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. కొబ్బరి నీళ్లు.. కురులకు, చర్మానికీ ఎంతో ఆరోగ్యం. వేసవిలో కొబ్బరి బోండాలకు మాంచి డిమాండ్‌ ఉంటుంది, దీనితో పాటు ధర కూడా అదిరిపోతుంది. ఎక్కువ రేటు పెట్టి కొన్నా కొన్ని సార్లు కొబ్బరి బోండాంలో నీళ్లు తక్కువగా వస్తూ ఉంటాయి. చాలా మందికి లేత కొబ్బరి, నీరు ఎక్కువగా ఉండే కొబ్బరి కాయను గుర్తించడం అంతగా రాదు. కొన్ని టిప్స్‌‌ ఫాలో అయితే.. లేత, నీరు ఎక్కువగా ఉండే కొబ్బరి బోండాన్ని సులభంగా గుర్తించొచ్చు

పరిమాణం: చాలా మంది పెద్ద బోండం తీసుకుంటే నీరు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. కానీ.. వాటికంటే.. కాస్త పరిమాణంలో చిన్నగా ఉన్న బోండంలో నీరు కాస్త ఎక్కువగానే ఉంటుందట. కాయ చిన్నగా ఉన్నా.. సిలిండర్ ఆకారంలో ఉంది అంటే.. అందులో నీరు ఎక్కువగా ఉందని అర్థమట. కొబ్బరికాయ ముదిరే కొద్దీ.. దాని ఆకారం పొడవుగా, దీర్ఘచతురస్రాకారంగా మారుతుంది. ముదురు కొబ్బరికాయల్లో నీటిశాతం తక్కువగా ఉంటాయి. మీరు కొబ్బరి బోండాం కొనేప్పుడు.. గుండ్రంగా ఉండేది సెలెక్ట్‌ చేసుకోండి. కొన్ని సార్లు షాప్‌లో పూర్తిగా గుండ్రంగా ఉండే.. బోండాం కొనడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భాల్లో.. తక్కువ స్లాంటే, పొడవు తక్కువగా ఉన్నది తీసుకోండి. కొబ్బరిబోండాం బంతిలా ఉబ్బినట్లు ఉండాలి. అలాంటి బోండాంలో కొబ్బరి షెల్ గుండ్రంగా, చాలా పెద్ద సైజులో ఉంటుంది. అందులో నీరు కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు బెంగళూరు బోండాలను గమనిస్తే, అవి గుండ్రంగా ఉంటాయి. వాటిలో నీరు ఎక్కువగానే ఉంటుంది.

బాగా షేక్​ చేయండి: కొనుగోలు చేసే ముందు, కొబ్బరికాయను తీసుకుని బాగా షేక్ చేయండి. షేక్ చేస్తున్నప్పుడు  నీరు కదులుతున్నట్లు శబ్దం వస్తే.. అందులో తక్కువ నీరు ఉన్నట్లు అర్థం. అలా కాకుండా.. ఎలాంటి శబ్ధం రావడం లేదు అంటే.. కొబ్బరికాయలో పుష్కలంగా నీరు ఉందని నిశ్శబ్దంగా షేక్ సూచిస్తుంది.  సాధారణంగా దేవుడి పూజకు కొబ్బరికాయ కొనేముందు కొబ్బరికాయను బాగా షేక్ చేసి దానిలోపల నీటి శబ్దం వింటుంటాం. కొబ్బరి బొండాంని కూడా అలాగే షేక్ చేయాలి. లోపల నీటి శబ్దం బాగా ఎక్కువ వినబడితే ఆ కొబ్బరి బొండాంలో నీరు తక్కువ ఉన్నట్టు. అదే నీటి శబ్దం తక్కువ ఉంటే లోపల నీటి శాతం ఎక్కవ ఉంటుంది.  లేత, తాజా కొబ్బరిలో ఎక్కువ నీరు ఉంటుంది, అది కదిలినప్పుడు శబ్దం రాదు. మీరు కొబ్బరి బోండాం కొనేప్పుడు.. దాన్ని బాగా ఆడించి చూడండి, అందులో నుంచి నీళ్ల శబ్దం వస్తుంటే అందులో నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందని అర్థం.ఎక్కువ, నిండుగా నీరు ఉంటే.. మీకు నీటి సౌండ్ వినపడదు.

ఆకుపచ్చ రంగు: కొబ్బరి బొండాం ఎంపిక విషయంలో రంగు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొబ్బరి బొండాం మీద ముదురు గోధుమ రంగు మచ్చలుంటే అందులో నీరు తక్కువ ఉంటాయి. అవి కొబ్బరి కాయలుగా రూపాంతరం చెందుతున్నాయని అర్థం. కానీ కొబ్బరి బొండాం మంచి ఆకుపచ్చ రంగులో ఆకర్షణగా ఉంటే అది తాజా కొబ్బరి బొండాం అని అర్థం. అందులో నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.  కొన్ని కొబ్బరికాయలు ముదురు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి, అంటే అవి త్వరలో పరిపక్వ కొబ్బరికాయలుగా మారుతాయి. ఈ కొబ్బరికాయలు తక్కువ నీటిని కలిగి ఉంటాయి, ఎందుకంటే అవి పరిపక్వ ప్రక్రియలో నీరు తగ్గి..కొబ్బరి పెరుగుతుంది.. ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగిన కొబ్బరికాయలను ఎంచుకోవడం మంచిది, ఎందుకంటే అవి అధిక నీటి కంటెంట్‌ను అందించే అవకాశం ఉంది.కొబ్బరికాయపై గోధుమ రంగు చారలు ఉంటే.. అది ముదిరిందని అర్థం..అలాంటి బోండాల్లో నీరు చాలా తక్కువ ఉంటుంది. నీటి బదులు.. కొబ్బరి పెరుగుతుంది. అందువల్ల మీరు తీసుకునే బోండాం పూర్తిగా గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి. అది తాజాగా ఉండాలి, ఎండినట్లు ఉండకూడదు.


వాసన చూడండి: లేత కొబ్బరి ఎలాంటి వాసన రాదు. మీరు మార్కెట్‌లో కొబ్బరి బోండాం కొనేప్పుడు.. దాని రెండు వైపులా వాసన చూడండి. దాని నుంచి ఏదైనా స్ట్రాంగ్‌ వాసన వస్తుంటే.. దాన్ని కొనొద్దు. దాన్ని వేలితో నొక్కి.. మెత్తగా అని పిస్తే తీసుకోవద్దు.

ముడుచుకుపోతున్నట్లు ఉండే కొబ్బరి బోండాల్లో నీరు తగ్గిపోతూ ఉంటుంది. నీరు కొబ్బరిలా మారుతూ ఉంటుంది. ఐతే, కొంతమంది కొద్దిగా కొబ్బరి ఉండే బోండాం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే.. కొద్దిగా కొబ్బరి ఉండే బోండాంలో నీరు తియ్యగా ఉంటుంది. అసలు కొబ్బరి లేని బోండాంలో నీరు చప్పగా ఉంటుంది. మరో విషయం బోండాం ఎప్పుడు కొన్నా.. ఆ నీటిని షాపు దగ్గరే తాగేయండి. వెంటనే తాగడం వల్ల.. వాటిలో పోషకాలన్నీ పూర్తిగా మీకు అందుతాయి. ఆలస్యం అయ్యేకొద్దీ పోషకాలు తగ్గిపోతాయి.