Health News:  వైరల్​ Vs డెంగ్యూ ఫీవర్​  ఎలా గుర్తించాలి

వర్షాకాలంలో దోమలు వ్యాపిస్తాయి. దోమ కాటు వలన  డెంగ్యూ టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో జనాలు ఇబ్బంది పడతారు.  ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .

డెంగ్యూకి మందులేదు. కానీ ట్రీట్మెంట్ ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని బతికించవచ్చు, జ్వరం, నీరసం, వాంతులు, రక్తస్రావం, కీళ్ల నొప్పులతో బాధపడే డెంగ్యూ రోగులకు జ్వరానికి, నెప్పులకు మందులు ఇవ్వొద్దట. డెంగ్యూకి ఉండే సింటమ్స్ ఆధారంగా  ప్రత్యేక చికిత్స ఇవ్వాలంటున్నారు వైద్య నిపుణులు. 

డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది

డెంగ్యూ ఫీవర్​ సాధారణమైన జ్వరాలలో ఒకటి. ఇది డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్ట్' అనే దోమ కుట్టడం వల్ల సంక్రమిస్తుంది. డెంగ్యూతో బాధపడే వ్యక్తిని ఈ దోమ కుడితే డెంగ్యూ ఫీవర్ కలిగించే.. వైరస్ దోమలోకి చేరుతుంది. అదోమ ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుడితే వాళ్లలోకి ఈ వైరస్ సంక్రమిస్తుంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వ్యాపిస్తుంది. 

డెంగ్యూ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రెండు మంచి ఏడు రోజుల్లో డెంగ్యూ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ ఇన్ఫెక్షన్ సాధారణంగా అదే తగ్గిపోతుంది. ఈ వ్యాధి వచ్చినట్లు కొంతమందిలో తెలియదు. ఈ వ్యాధి ప్రధానంగా మూడురకాలు.

  • 1.  తెలియని జ్వరం  (Un Identified Fever )
  • 2. రక్తస్రావంతో కూడిన డెంగ్యూ జ్వరం (Dengue Hemorrhagic Fever) 
  • 3 రక్తస్రావం, లో - బీపీతో కూడిన డెంగ్యూ జ్వరం(Dengue Hemorrhagic ShockFever)

డెంగ్యూని ఎట్ల గుర్తుపట్టాలి

సాధారణంగా రెండు నుంచి 7 రోజులు  జ్వరం వచ్చి తగ్గిన తర్వాత తెల్ల రక్తకణాలు పడిపోవడం, రక్తస్రావం, బీపీ తగ్గుతుంది. మూత్రం సరిగా రాదు. స్పృహకోల్పోతారు.. సాధారణంగానే ఈ సీజన్లో ఫీవర్​ తో  చాలా మంది బాధపడుతుంటారు. ఈ స్థితిలో ఉన్న వాళ్లలో చర్మంపై ఎర్రని మచ్చలు కనబడుతున్నా కళ్లలో, నోటిలో ఎర్రని మచ్చలు వచ్చినా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, ఇంజక్షన్ ఇచ్చిన చోట లేదా వేరే శరీర భాగాలపై రక్తస్రావం జరుగుతున్నా.. వాంతిలో రక్తం ఉన్నా. విరేచనం నల్లగా వస్తున్నాడెంగ్యూ హెమరేజిక్ జ్వరం ఉప్పట్లుగా అనుమానించాలి. రక్తస్రావ లక్షణాలను ముందుగా కనుగొనడానికి 'టోర్నికే  టెస్ట్ చేసి గుర్తించవచ్చు. ఫ్రీ ఎక్సాంప్రియా, డెంగ్యూ ఒకే లక్షణాలతో ఉంటాయి. కానీ చికిత్స వేరు కాబట్టి ప్రీఎక్సాంప్రియా నుంచి వేరుగా డెంగ్యూని గుర్తించాలి. ఈ జబ్బుతో రక్త నాళాలలో సన్నని రంధ్రాల ద్వారా కణజాలం నుంచి రక్తం లీక్ అవుతుంది. దీని వలన కాళ్లు, చేతులు, ముఖం వాస్తాయి. పొట్టలో, ఊపిరి ఉత్తుల బయట, గుండె చుట్టూ నీరు చేరుతుంది.. ఇలా జరగడం వల్ల ఆయాసం పెరుగుతుంది. 

డెంగ్యూ కి మందు లేదా...

డెంగ్యూ జ్వరానికి సరైన మందులు లేవు. డెంగ్యూ వైరస్ లలో నాలుగు రకాలున్నాయి.. నాలుగు రకాల వైరస్ లో రెండవ రకం సోకితే చాలా ప్రమాదం. మొదటి రకం ఇన్ఫెక్షన్ పచ్చిన తర్వాత రెండో రకం వస్తే ఇంకా ఎక్కువ ప్రమాదం.   వచ్చిన వ్యక్తికి బీపీ పడిపోక ముందు మండే ఓఆర్ఎ ఎస్ ద్రవం ఇవ్వాలి షాక్​ లోకి పోతున్న వ్యక్తికి నరాల ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించాలి.  రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి ప్లేట్​ లెట్స్​ ఎక్కించాలి. ప్లాస్మా( ఫ్రెష్ ప్రాజెన్ ప్లాస్మ) అవసరాన్ని బట్టి ఎక్కించాలి. ప్లేట్ లెట్స్ అయిదు వేల నుంచి పది వేల మధ్య ఉంటే వెంటనే ప్లేట్ లెట్స్ బయటి నుంచి ఎక్కించాలి. 

డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి...

డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే దోమకాటు నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిందే. డెంగ్యూ జ్వరం కలిగించే దోమ సాధారణంగా పగటిపూటే కుడుతుంది. కాబట్టి దోమ తెరలు వాడే ఉపయోగం లేదు. దోమలు ఉంటే. కాళ్లూ, చేతులు పూర్తిగా కప్పే దుస్తులే ధరించాలి. దోమలు పెరగకుండా నీటి నిల్వలు ఇంటికి దగ్గర్లో లేకుండా చేయాలి. నిలిచిపోయిన నీళ్లలో ఇవి గుడ్లు పెడతాయి. కాబట్టి పాత టైర్లు, డబ్బాలు, కొబ్బరి బొండాలు మొదలైనవి ఇంటి పరిసరాల్లో ఉంటే వర్షం పడ్డప్పుడు నీళ్లు నిలుస్తాయి. వీటిలో దోమలు చేరి, గుడ్లు పెడతాయి.
నీళ్లు నిలిచే సామాగ్రిని తీసేయాలి. కూలర్లలో నీళ్లు ఉంటే తీసేయాలి. కూలర్లు వాడే వాళ్లు ప్రతిరోజు నీళ్లను మార్చాలి.  నీటిపై రసాయపాలను పిచికారీ చేసి దోమల లార్వాలను చంపేయాలి.

డెంగ్యూతో ఎందుకు చనిపోతున్నారు

డెంగ్యూకి మందు లేకున్నా జ్వరం, రక్త కణాల క్షీణత, రక్తస్రావాన్ని ఆపేందుకు చికిత్స అందిస్తారు. బీపీని పెంచేందుకు ఫ్లూయిడ్స్ ఇస్తూ రోగి కోమాలోకి పోకుండా చేయొచ్చు.. కొద్ది రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే రోగ నిరోధక శక్తిని మెరుగుపరచుకోవచ్చు.. సాధారణంగా జ్వరం తగ్గిపోయింది కదా. ఇంకేమీ కాదులే అనుకుని వైద్యసాయానికి వెళ్లకపోతే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే . డెంగ్యూకి వయసుతో సంబంధం లేదు. ఆడా, మగా అందరికీ వస్తుంది. డెంగ్యూ పట్ల గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

డెంగ్యూ లక్షణాలు

  • జ్వరం
  • తలనొప్పి
  • కంటి వెనుక కండరాల నొప్పి
  •  ఒళ్లు నొప్పులు
  • దద్దుర్లు 
  • ఒంటిపై ఎర్ర మచ్చలు
  •  చిగుళ్ల నుంచి రక్తం కారడం
  •  రక్తంలో తెల్ల రక్తకణాలు సంఖ్య తగ్గడం


డెంగ్యూ పేషెంట్ కి ఇవి చేయకూడదు.

  • ఆస్ప్రిన్, బ్రూఫెన్ లాంటి జ్వరం నివారించే మందులు ఇవ్వకూడదు.
  • షాక్ లేదా రక్తస్రావం లేనప్పుడు ముందు జాగ్రత్తగా ఐవీ ఫ్లూయిడ్స్​ ఇవ్వకూడదు.
  • అవసరమైతేనే రక్తం ఎక్కించాలి.
  • స్టిరాయిడ్ మందులు ఇవ్వకూడదు. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. 
  • యాంటి బయాటిక్స్ అవసరం లేదు కాబట్టి వాటిని ఇప్పకూడదు.
  •  ముక్కు ద్వారా కడుపు లోకి గొట్టం (రైట్స్ ట్యూబ్) వేసి పొట్టలో రక్తస్రావం ఏమైనా జరుగుతుందో, లేదో తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు.
  • రక్తస్రావం జరుగుతుంటే రైట్స్​ ట్యూబ్ ఉపయోగించి తగ్గించే ప్రయత్నాలు చేయకూడదు.