గుడ్ న్యూస్.. వాట్సాప్లో కొత్త ఫీచర్.. ఆన్లైన్ స్టేటస్ దాచవచ్చు

వాట్పాప్..ఈ యాప్ లేకుండా ఏ స్మార్ట్ ఫోన్ లేదంటే ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు వాట్సాప్ ను వినియోగిస్తున్నాడు. వాట్పాప్ యాప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి వాటిని స్నేహితులు, బంధువులు, సంస్థలు,  ఆఫీసులు ఇలా ప్రపంచంలో ఎక్కడికైనా ఎవరికైనా పంపించుకోవచ్చు.  ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యూజర్లు ఉన్న ఈ యాప్.. వారి భద్రత, కన్వీనియెన్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు, యాప్ లో మార్పులు,చేర్పులు చేస్తూనే..ఇటీవల కాలంలో ప్రైవేసీ బేస్డ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ చాట్ యాప్ లాక్ వంటి ఫీచర్లు తీసుకొచ్చింది. తాజాగా ఆన్ లైన్ స్టేటస్ ను హైడింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుంది. ఈ ఫీచర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.. 

ఎవరైనా ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు వారి వాట్సాప్ చాట్‌ను చివరిసారిగా ఎప్పుడు తనిఖీ చేసారు..వారు ఎప్పుడు టైప్ చేస్తున్నారు.. వంటి WhatsApp స్టేటస్ సమాచారాన్ని కూడా ప్రదర్శిస్తుంది. వినియోగదారు గోప్యతను గౌరవించడానికి WhatsApp వినియోగదారులు వారి చివరిసారి చూసినటువంటి ఆన్‌లైన్ స్టేటస్  వంటి వాటిని దాచడానికి ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు. 

వాట్సాప్ వినియోగదారులు తమ ప్రైవసీని రక్షించడానికి లేదా ఏదైనా ఇతర ఫీచర్ కోసం వారి ఆన్‌లైన్ స్టేటస్ ను ఇతరుల నుండి దాచవచ్చు. WhatsAppలో ఆన్‌లైన్ స్టేటస్‌ను ఎలా దాచాలనే దశల వారీగా తెలుసుకుందాం. 

  • వాట్సాప్‌ని తెరిచి, రైట్ సైడ్ కార్నర్ లో మూడు చుక్కలపై క్లిక్ చేయాలి
  • కనిపించే మెను నుంచి సెట్టింగ్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి 
  • ప్రైవసీ నొక్కి ఆన్ లైన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి 
  • ఇక్కడ Who can see my last seen, choose from Everyone, My contacts, My contacts except..., or Nobody  అని ఆప్షన్లు కనిపిస్తాయి. 

వీటిలో మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం.. మీ ఆన్ లైన్ స్టేటస్ ఉంటుంది.. ఉదాహరణకు Nobody  అనే ఆప్షన్ ను ఎంచుకుంటే మీ ఆన్ లైన్ స్టేటస్ ఎవరికీ కనిపించదు. 
దీంతోపాటు పెరుగుతున్న వినియోగ దారుల సంఖ్య ను దృష్టిలో ఉంచుకిన కంపెనీ యాప్, వెబ్ సైట్ రెండింటికీ సెక్యూరిటీ,ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేసింది. వాట్సాప్ వినియోగదారులు వారి స్టేటస్ చిత్రాన్ని ఇతరునుంచి దాచవచ్చు. ఆన్ లైన్ స్టేటస్ ను కూడా దాచవచ్చు. చాట్ లను లాక్ చేయొచ్చు. ఎంపిక చేసిన కాంటాక్ట్, ఫ్రెండ్స్ కు మాత్రమే మీ ఆన్ లైన్ స్టేటస్ కనిపించేలా  సెట్ చేయవచ్చు.