నకిలీ పుచ్చకాయను గుర్తించడం ఎలా...

వేసవి దగ్గరకు వచ్చింది. ఈ సీజన్‌లో ఎక్కువ డిమాండ్ ఉండేది పుచ్చకాయలకు.  అయితే వీటికి రంగు రావడానికి కొన్ని  రసాయనాలు కలుపుతూ ఉంటారు. వాటిని గుర్తించాలి. ఇలాంటి పుచ్చకాయ తింటే ఆరోగ్యమేమో కాని... అనారోగ్యం మాత్రం తప్పక వస్తుంది. మరి రసాయనాలు కలిపిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. . . .

పుచ్చకాయను చూస్తే నోరూరుతుంది. అలాగే పుచ్చకాయ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. నీటి శాతాన్ని నిర్వహిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, కళ్లకు మంచిది, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. వేసవిలో తప్పకుండా తినాల్సిన వాటిలో ఒకటి ఇది. మార్కెట్‌లో లభించే అన్ని పుచ్చకాయలు మంచివే అని చెప్పలేం. అవి త్వరగా పండేందుకు వాటిలో రసాయనాలు కలుపుతూ ఉంటారు. పుచ్చకాయలు త్వరగా చెడిపోకుండా ఉండేందుకు, లోపలి భాగం ఎరుపు రంగులో ఉండాలని వివిధ కారణాలతో పుచ్చకాయలకు రసాయనాలు కలుపుతారు. ఆ పండ్లు చూసినప్పుడు చాలా ఎర్రగా ఉంటాయి. కానీ రుచి మాత్రం ఉండదు. పండును తియ్యగా చేసేందుకు రసాయనాలు కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి చాలా హానికరం.

సూదితో పొడిచిన రంధ్రం

సాధారణంగా పండ్లను సరిగా పరిశీలిస్తే అందులో కెమికల్ కలిపారో లేదో అర్థం చేసుకోవచ్చు. నిశితంగా పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. పుచ్చకాయలో సూదితో పొడిచిన చిన్న రంధ్రం ఉంటుంది. అమ్మేవారిని అడిగితే ఈ విషయం ఒప్పుకోరు. ఇలాంటి పండ్లు కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.పండ్లు త్వరగా పక్వానికి రావడానికి కార్బైడ్‌ను కలుపుతారు. ఇది ఇథనాల్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా పండ్లు త్వరగా పండుతాయి. త్వరగా పక్వానికి రావడానికి, రంగు వచ్చేలా చేయడానికి సుడాన్ రెడ్, మిథనాల్ ఎల్లో, మెర్క్యూరీ క్రోమేట్ వంటి రసాయనాలను కూడా ఉపయోగిస్తారని ఆహార నిపుణులు చెబుతున్నారు.

రసాయనాలు ఇంజెక్ట్ చేస్తారు

పుచ్చకాయలను కొందరు ఎర్లీగానే కట్ చేసి తీసుకొస్తారు. దానిలో రసాయనాలను ఇంజెక్ట్ చేస్తారు. అయితే ఇలా చేసినప్పుడు గుజ్జు పగిలిపోయి రంగులో తేడా ఉంటుంది. కోసినప్పుడు విడిపోతే ఆ పుచ్చకాయలో కెమికల్ కంటెంట్ ఉందని చెప్పొచ్చు. కొన్నిసార్లు మనం పుచ్చకాయను కోస్తుంటే గుజ్జులో తేడా కనిపిస్తుంది. కింద పడుతూ ఉంటుంది. అది సరైనది కాదని అర్థం.

తెల్లటి మచ్చలు కనిపిస్తే..

పుచ్చకాయ పండ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే, అలాంటి పండ్లపై రసాయనాలు స్ప్రే చేసినట్లు భావించవచ్చు. వాటిని చేతులతో తాకగానే పౌడర్ చేతులకు అంటుకుంటుంది. అలాంటి పండ్లను కొనకండి. త్వరగా పండేందుకు ఇలాంటి కెమికల్స్ వాడుతారు. ఆరోగ్యానికి మంచిది కాదు.పుచ్చకాయ బాగా పండాలి. కానీ కాయలుగా ఉన్నప్పుడే వాటిని తీసుకొచ్చి కొందరు రసాయనాలు కలుపుతారు. దీంతో పండిన పుచ్చకాయ గింజలు చాలా చిన్నవిగా ఉండాయి. అదే సహజంగా పండిన పుచ్చకాయ పండ్ల గింజలు నల్లగా ఉంటాయి..., పెద్దగా ఉంటాయి.

శరీరంపై దుష్ప్రభావాలు

కార్బైడ్‌తో చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మిథనాల్ కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. క్రోమేట్ కడుపు సమస్యలు, రక్తహీనత, మెదడు దెబ్బతినడం, సంతానోత్పత్తి తగ్గడం వంటి సమస్యలను కలిగిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తింటాం. కానీ మనం తినే పండ్లు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే లాభం కోసం పండ్లపై రసాయనాలు వాడుతున్నారు. రసాయన రహిత పండ్లు తినడం మాత్రమే ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయ కొనేటప్పుడు పైన చెప్పిన విషయాలను గుర్తుంచుకోండి