Good Health: వావ్...  అరటి కాండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా...

అరటి చెట్టులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అరటి చెట్టులోని ప్రతీ భాగం ఆరోగ్యానికి ఉపయోగ పడేదే. అరటి పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.  అరటిని సంవత్సరానికి రెండుసార్లు తినాలని ఒక సామెత ఉంది. పలు రకాల అనారోగ్య సమస్యల రాకుండా ఉంటాయి. అదే విధంగా అరటి కాండంతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ఈ అరటి కాండాన్ని ఔషధంగా వినియోగిస్తూ ఉంటారు. అనేక వ్యాధులను నయం చేసేందుకు అరటి కాండం తింటే చాలా మంచిది. ఇందులో ఫైబర్ శాతం మెండుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేగుల్లో పేరుకునిపోయిన వ్యర్థాలను, మలినాలను బయటకు పంపుతుంది. అరటి కాండం తింటే ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు చూద్దాం.

నరాల సమస్యలకు చెక్

అరటి కాండం తినడం వల్ల నరాల సమస్యలు అదుపులోకి వస్తాయి. నరాల సమస్యలతో బాధ పడే వారు అరటి కాండం రసాన్ని తరచూ తాగాలి. ఇలా తాగితే నరాల సమస్యలు ఉండవు. అదే విధంగా పొడి దగ్గుతో ఇబ్బంది పడేవారు కూడా అరటి కాండం రసం తాగితే చాలా బెటర్‌గా పని చేస్తుంది.

రక్తం శుద్ది ...

బ్లడ్ ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలతో బాధ పడేవారు అరటి కాండం సూప్ తాగితే.. రక్తం శుద్ధి అవుతుంది. దాహం అతిగా వేసేవారు కూడా అరటి కాండం చూర్ణం లేదా రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి

కాలిన గాయాలు ఎక్కువ కాలం మానకపోతే అరటి కాడను తీసుకుని నిప్పులో కాల్చి బూడిదను తీసుకుని కొబ్బరినూనెతో కలిపి రాసుకోవాలి. ఎలాంటి కాలిన గాయమైనా నయం అవుతుంది.

మహిళల సమస్యలకు పని చేస్తుంది

 అరటి కాండంలో కాస్త ఆవాలు కలుపుకొని తింటే అలెర్జీ, చర్మ చికాకు, మూలవ్యాధి సమస్యలు తగ్గుతాయి. నెలసరి సమయంలో మహిళలు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు.రుతుక్రమం సమయంలోనూ మహిళలకు వచ్చే వివిధ సమస్యలకు అరటి కాండం ద్వారా పరిష్కారం దొరుకుతుంది.
నెలసరి సమయంలో మహిళలు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు అరటి కాండంతో మంచి పరిష్కారాలు దొరుకుతాయి. అరటి కాండం రసం లేదా అరటి పువ్వు రసాన్ని తాగాలి. అరటి రసంలో ఆస్ట్రింజెంట్ ఉంది. నేరుగా తాగలేని వారు బెల్లం కలుపుకుని తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది.తెల్ల చక్కెర వేయకపోవడమే మంచిది.

కామెర్లకు పరిష్కారం

కామెర్లు ఉన్నవారు అరటి కాండంను ఎండలో బాగా ఆరబెట్టి పొడిలా చేసుకుని.. రోజూ ఒక చెంచా తీసుకుని అందులో తేనె కలుపుకొని తీసుకోవాలి కామెర్లు సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంది. 

మూత్ర విసర్జన సమస్యలకు చెక్

మూత్ర విసర్జన సరిగా రాని వారు, లేదా మూత్ర విసర్జన సమయంలో చిరాకుగా ఉన్నవారు తరచుగా అరటి కాండం భోజనంలో చేర్చుకోవడం వల్ల మూత్ర విసర్జన సులువు అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా పరిష్కారమవుతుంది. చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కొంటారు. అరటి కాండం తింటే ప్రయోజనాలు పొందవచ్చు.

అరటి కాండం రసం తాగితే .....

అరటి కాండం నరాల సమస్యలను నయం చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. రోజూ రెండు లేదా మూడు చెంచాల అరటి కాండం రసాన్ని తాగితే తరచుగా వచ్చే పొడి దగ్గు నయమవుతుంది. ఎక్కువగా దాహం వేసే వారు అరటి కాండం చూర్ణం చేసి ఆ రసాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. చెవులకు సంబంధించిన సమస్యలు, గర్భాశయ సంబంధిత వ్యాధులు, రక్తశుద్ధి తదితర సమస్యలు సరిచేయాలంటే ప్రతిరోజూ ఒక కప్పు అరటి కాండం సూప్ తాగండి.

ఇంకా ఏమేమి ఉన్నాయంటే..

  • గోళ్ళు కొరికే అలవాటు ఉన్నవారు ఈ అరటి కాండాన్ని మధ్యభాగాన్ని తినడం వల్ల కడుపులోని మలినాలు, వెంట్రుకలు తొలిగిపోతాయి.
  •  మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
  •  శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి ఉందని పురాతన కాలం నుంచి ప్రజలు విశ్వసిస్తున్నారు.
    అరటి కాండంతో చేసిన రసం తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య తగ్గుతుంది. అరటి పండ్లలో పొటాషియం కంటెంట్ మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది.
  • రక్త హీనతను నివారించడం తోపాటు.. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మరియు విటమిన్ బి కూడా పుష్కలంగా లభిస్తుంది.
  •  కరోనా వైరస్ సోకిన వారు అరటి కాండం తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది .
  •  100 గ్రాముల అరటి కాండంలో 13 కేలరీలు, 2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, ఒక గ్రామ్ ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా  జుట్టు రాలే సమస్యలను కూడా నివారిస్తుంది.
  • ఫైబర్ కలిగిన అరటి కాండం తినడం వల్ల శరీర కణాలలో నిల్వ ఉన్న కొవ్వు, చక్కెరల విడుదలను నియంత్రిస్తుంది. అరటి కాండం నుంచి తీసిన రసం శరీరం నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తరచుగా అసిడిటితో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

అరటి కాండాన్ని ఎలా తినాలంటే 

అరటి చెట్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కేవలం అరటిపండ్లు, అరటి ఆకులు మాత్రమే కాదు అరటి చెట్టు కాండం కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అరటి కాండం ఆరోగ్యం విషయంలో దివ్యఔషధంలా పనిచేస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో అరటి చెట్లు గాలికి విరిగిపోతాయి. ఈ సందర్భంలో ఆకులు, పండ్లు మాత్రమే కాకుండా కాండం కూడా ఇంటికి తెచ్చుకోండి. దానిని తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటి చెట్టును ఎలా తినాలో తెలియక చాలా మంది కంగారు పడుతారు  అరటి చెట్టును మధ్యలో కత్తిరించి లోపల కనిపించే తెల్లని దిండు లాంటి పదార్థం ఉంటుంది. దీనినే అరటి కాండం అంటారు. దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఈ రకమైన తెల్ల అరటి కాండం ఆరోగ్యానికి ఎంతో  అవసరమవుతుంది.