గూగుల్ ప్లేస్టోర్‌లో రకరకాల యాప్‌లను డౌన్లోడ్ చేయడం తెలిసిందే. అయితే, ఒకేసారి రెండు మూడు యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలంటే మాత్రం కుదరదు. ఒకదాని తర్వాత మరొకటి చేయాల్సి ఉంటుంది. కానీ, అది మొన్నటిదాకా. ఇప్పుడు అలా కాదు.. రెండు యాప్‌లను ఒకేసారి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా రెండు యాప్‌లు ఒకే టైంకి డౌన్లోడ్ అవుతాయి.
మూడో యాప్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మాత్రం అది పెండింగ్‌లో ఉంటుంది. ముందు రెండు యాప్‌ల డౌన్లోడ్ పూర్తవ్వగానే అది కూడా పూర్తవుతుంది. కొత్తగా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. యాప్‌ని అప్డేట్ చేస్తే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి డౌన్లోడ్ అవుతాయి. మరి ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటంటే.. కొత్త ఫోన్ కొన్నవాళ్లు కొన్ని యాప్స్ ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫీచర్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేందుకు గంట పట్టే టైం కాస్తా అరగంటలో అవుతుంది. ప్రస్తుతానికి రెండు యాప్‌లు మాత్రమే ఒకేసారి ఇన్స్టాల్ అవుతాయి. ఆ తర్వాత మరో రెండేసి చొప్పున యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి.