మీ ఆధార్‪పై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా? ఇలా చెక్ చేసుకోండి

గత డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త టెలికాం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. 2023 కొత్త టెలికాం చట్టంలోని కొన్ని సెక్షన్లు 2024 జూన్ 26 నుండి అమలులోకి రానున్నాయి. ఇందులో SIM కార్డ్‌లు కొనుగోలు చేయడం, నకిలీ కనెక్షన్‌లు మరియు కాల్ ట్యాపింగ్‌లకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి. ఈ కొత్త టెలికాం నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోకుడదు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. 

ఇప్పుడు టెలికాం చట్టం 2023 ఉంది.. 150 ఏళ్ల నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885. దానికి అప్పటి నుంచి కొన్ని సార్లు పలు మార్పులు చేశారు. ఒకే ఆధార్ తో తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే రూ.50వేల జరిమానా, మళ్లీ ఇంకో సారి అలా చేస్తే రూ.2లక్షల జరిమాన విధిస్తారు. వేరే వ్యక్తుల ఐడీ ఫ్రూఫ్ లతో ఫేక్ డిటేల్స్ ఇచ్చి సిమ్ కార్డు తీసుకుంటే మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా రూ.50లక్షలు ఫైన్ విధిస్తారు. కొన్ని సార్లు రెండూ విధిస్తారు. 

మీ ఆధార్ పై ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకోండిలా..

  •  తమ పేరుపై ఉన్న సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోవడానికి  Sancharsathi.gov.in లోకి వెళ్లాలి.
  • వెబ్ సైట్ లో కిందకి స్క్రోల్ చేసి మొబైల్ కనెక్షన్ పై క్లిక్ చేయండి.
  • అక్కడ వాళ్ల 10 డిజిట్ మొబల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
  • తర్వాత ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. అది ఆ వెబ్ సైట్ లో టైప్ చేయాలి.
  • సబ్మిట్ బట్టన్ క్లిక్ చేయగానే వారి ఆధార్ పై ఉన్న ఫోన్ నెంబర్లు చూడవచ్చు.