ఇల్లు పెద్దదై వైఫై సిగ్నల్స్ రేంజ్​ తగ్గి..ఇంటర్నెట్​ స్పీడ్​ వస్తలేదా..?

ఇప్పుడు ఇంటర్నెట్​ లేనిదే రోజు గడవడం లేదు. అందుకే చాలామంది ప్రత్యేకంగా ఫైబర్​ కనెక్షన్లు​ తీసుకుంటున్నారు. కానీ.. ఇల్లు పెద్దదైతే వైఫై సిగ్నల్స్ రేంజ్​ తగ్గి, రౌటర్​కి దూరంగా ఉండే గదుల్లో ఇంటర్నెట్​ స్పీడ్​ తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నవాళ్లు ఈ గాడ్జెట్​ని వాడితే సరిపోతుంది. ‘టీపీ లింగ్’​ అనే కంపెనీ ఈ వైఫై రేంజ్​ ఎక్స్​టెండర్​ని తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ గాడ్జెట్​కి ఎలాంటి వైర్​ కనెక్షన్స్​ ఇవ్వాల్సిన పనిలేదు.

ALSO READ : ఐప్యాడ్​, ఆండ్రాయిడ్​ ఫోన్, కంప్యూటర్​.. అన్నింటికీ ఒకే పెన్​డ్రైవ్​ వాడొచ్చు..!

ఇన్​స్టలేషన్​ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పవర్​ సాకెట్​లో ప్లగ్​ చేసి, వైఫైకి కనెక్ట్​ చేస్తే సరిపోతుంది. ఇది 750 ఎంబీపీఎస్​ స్పీడ్​ వరకు సపోర్ట్​ చేస్తుంది. ఆన్​లైన్​ గేమింగ్, స్ట్రీమింగ్​ ​ లాంటివన్నీ ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఇథర్నెట్ పోర్ట్‌ కూడా ఉంటుంది. దాంతో.. డెస్క్​టాప్, గేమింగ్ కన్సోల్స్​, బ్లూ-రే ప్లేయర్స్​, టీవీ లాంటి డివైజ్​లకు కూడా కనెక్ట్​  చేసుకోవచ్చు.  ధర : 1,799 రూపాయలు