Astrology: ఆఫీసు టేబుల్​ ఎలా ఉండాలి.. దానిపై ఏ వస్తువులు ఉంటే ఏం జరుగుతుంది..

ఆఫీసు అంటే  డబ్బు సంపాదించి పెట్టే స్థలం.  బడికి.. గుడికి.. ఎంత ప్రాధాన్యత ఇస్తామో.. ఆఫీసుకు అంత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.అందుకే work is worship అనే నానుడి ఏర్పడింది.   ఇక ఆఫీసులో టేబుల్​, డెస్క్​.. పేపర్​, పెన్​ ఇలా ఉంటాయి.  ఇప్పుడైతే కంప్యూటర్లు వచ్చాయనుకోండి.   చాలా మంది ఆఫీసులో....  వారు పని చేసే టేబుల్​పై  చిందరవందరగా.. పేపర్లు.. పెన్నులు.. తాగేసిన టీ గ్లాసులు.. వాటర్​ బాటిల్​ ఇలా ఎక్కడ పడితే అక్కడ చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇలా ఉంటే నెగిటివ్​ ఎనర్జీ వస్తుందని సిద్దాంతులు చెబుతున్నారు.  అంతేకాదు.. బాస్​ చెప్పిన పని త్వరగా చేయలేక ఏదో ఒక అడ్డంకులు వస్తాయి.  అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆఫీస్​ టేబుల్​ ఎలా ఉండాలి... దానిపై ఎలాంటి వస్తువులు ఉండాలో తెలుసుకుందాం. . ..

పనిలోనే దైవం ఉన్నదని అర్థం. పనిచేసుకునే డెస్క్ చాలా పవిత్రమైంది. అది మీకు సంపదను, కీర్తి ప్రతిష్టలను ప్రసాదించే ప్రదేశం. జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇచ్చే ప్రదేశం. అందుకే వాస్తు శాస్త్రం ఈ ప్రదేశాన్ని నెగెటివిటికి దూరంగా ఉంచుకోవాలని సూచిస్తోంది. పాజిటివ్ గా ఉంచుకోవడం వల్ల పనిలో మరింత సామర్థ్యాన్ని చూపగలిగే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని శాస్త్రం చెబుతోంది. పనిచేసుకునే ప్రదేశం పరిసరాలు శుభ్రంగా ఉండాలి. చెత్త చేరకుండా చూసుకోవాలని వాస్తు సూచిస్తోంది. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.

పనిచేసుకునే డెస్క్ శుభ్రంగా, ఆర్గనైజ్డ్ గా ఉండాలి. ఇలా శుభ్రమైన డెస్క్ దగ్గర కూర్చున్నపుడు పనిమీద ఏకాగ్రత కుదురుతుంది. త్వరగా లక్ష్యాలను చేధించగలుగుతారు. వాస్తు ప్రభావం జయాపజయాల మీద తప్పకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆఫీస్ ఎంట్రెన్స్  వైపు వీపు ఉండేలా ఎన్నటికీ కూర్చోకూడదట. ఇది మీ పనిమీద తీవ్రమైన ప్రభావం చూపుతుందట.

ఆఫీసు కోసం కొన్ని వాస్తు చిట్కాలు

లక్కీ బాంబూ ( వెదురు మొక్క): వాస్తులో వెదురు మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎదురులేని ఎదుగుదలకు సూచికగా ఉండే లక్కీ బాంబూ మొక్కను పనిచేసుకునే టేబుల్ మీద ఉంచుకుంటే సంతోషాన్ని, అదృష్టాన్ని తెస్తుంది. అంతేకాదు మీరు పనిచేసేందుకు ఎల్లప్పుడు సంసిద్ధంగా ఉన్నారనేందుకు సూచన కూడా. అవకాశాన్ని బట్టి ఈ మొక్కను పెట్టుకోవాలి.  లేకపోతే చిన్నపాటి దేవుడి పటాన్ని ఉంచుకోవాలి. 

టేబుల్ క్లాక్ : పనిచేసుకునే డెస్క్ మీద తప్పకుండా ఒక గడియారాన్ని పెట్టుకోవాలి. డెస్క్ మీద దీనిని ఎడమ వైపు పెట్టకోవాలి. ఇది సమయం చూసుకునేందుకు అనువుగా మాత్రమే కాదు జీవితంలోకి పాజిటివిటిని, క్లారిటీని తెస్తుంది. ఏపని ఎంత టైంలో పూర్తి చేయాలో ఒక ప్రణాళిక తయారుచేసుకోవాలి. 

స్టేషనరీ :  ఒక నోట్ బుక్, పెన్ తప్పకుండా పని చేసే డెస్క్ మీద ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వాస్తులో చాలా ముఖ్యమైందిగా చెబుతున్నారు. ఇది ఆలోచనల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. జీవితంలో ప్రతి విషయంలో ఒక క్లారిటిని ఇస్తుంది. ఇవి కూడా టేబుల్ మీద ఎడమవైపునే పెట్టుకోవాలి. పని చేసేటప్పుడు కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఒత్తిడిలో అవి గుర్తుండవు.  అందకే వాటిని వెంటనే డేట్​ వేసి బుక్​ లో నోట్​ చేసుకోవాలి. 

కుబేరయంత్రం: కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. అంటే ఏపని చేసినా అది డబ్బు సంపాదించేందుకే అనేది నిర్వివాదాంశం. అందుకే కుబేర విగ్రహాన్ని పనిచేసే డెస్క్ మీద తప్పకుండా పెట్టుకోవాలి. ఇత్తడి విగ్రహం అయితే మరీ మంచిది. ఇది ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది.

గ్లోబ్: డెస్క్ మీద గ్లోబ్ పెట్టుకుంటే ఇది నిరంతర అభివృద్ధికి నిదర్శనంగా ఉంటుంది. గ్లోబ్ ఎప్పుడూ టేబుల్ మీద కుడివైపును అమర్చుకోవాలి. ఇలా చేస్తే అవకాశాలు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయి.

 టేబుల్​ పై ఇలాంటి  వస్తువులు  అసలు వద్దు

ఎప్పుడూ పనిచేసుకునే డెస్క్ శుభ్రంగా ఉండాలి. వాస్తు ప్రకారం లాప్ టాప్, దాని చార్జర్ టెబుల్ మీద ఎప్పుడూ పెట్టి ఉంచుకోవద్దని చెబుతోంది. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. మీరు కూర్చునే టేబుల్ వెనుక తప్పకుండా గోడ ఉండేలా జాగ్రత్త పడాలి. ఇది మీరు దృఢంగా, స్థిరంగా ఉండటాన్ని సూచిస్తుంది. మీరు ఇంటి నుంచే పనిచేస్తున్నట్టయితే పనిచేసుకునే టేబుల్ ను డైనింగ్ టేబుల్ గా, కిచెన్ టేబుల్ గా అసలు వాడకూడదు. ఇది కేవలం పని చేసుకునేందుకు మాత్రమే వినియోగించాలని గుర్తుపెట్టుకోవాలి.