మీకు తెలుసా : స్నానం ఇలా చేయాలి.. ఏదో హడావిడిగా నాలుగు చెంబులు పోసుకోవటం కాదు..!

కొందరు స్నానమంటే హదావుడిగా నాలుగు చెంబుల నీళ్లు వంటిపై పోసుకొని వచ్చేస్తారు. మరి కొందరు శరీరం కూడా పూర్తిగా తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు. కానీ స్నానం అంటే బకెట్ లో ఉన్న నీటిని ఒంటి మీద కుమ్మరించుకోవడం కాదు. శరీరమంతా శుభ్రపరుస్తూ మర్దన చేయడమే స్నానం. స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఇప్పుడు ఆ జాగ్రత్తలను తెలుసుకుందాం. . 

స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ  వేడిగా ఉండకూడదు. చల్లగానూఉండకూడదు.  గోరువెచ్చగా లేదా. ..వంటికి హాయి కలిగించేటంత వేడి ఉండాలి. చర్మం మీద ఉండే సెబేషియస్ గ్రంథులు ఉత్తేజితమై చర్మసంరక్షణకు అవసరమైన నూనెలను స్రవించడానికి తగినంత వేడి మాత్రమే ఉండాలి. నీటి వేడి మరీ ఎక్కువైనా, మరీ తక్కువైనా చర్మం పొడిబారిపోతుంది. అలాగే ఎక్సోఫోలియేషన్ కోసం స్నానం చేసేటప్పుడు స్క్రబ్ వాడాలి. 

Also Read :- దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ

అయితే రోజూ స్క్రబ్ ఉపయోగిస్తే చర్మకణాలు దెబ్బతింటాయి.... కాబట్టి  స్క్రబ్ వారానికి రెండుసార్లకు మించకూడదు. ఇందుకోసం మార్కెట్ లో దొరికే రెడీమేడ్ స్క్రబ్లను వాడొచ్చు లేదా గరుకుగా ఉండే సున్నిపిండిని ఎంచుకోవచ్చు.. వారంలో రెండుసార్లు వంటికి నూనె లేదా మీగడ రాసి మర్దన చేసి స్నానం చేయాలి. తగిన సమయం లేకపోతే కనీసం ఒక్కసారయినా అలా చేయాలి.వంటిని రుద్దేటప్పుడు మురికి త్వరగా వదలడం కోసం గోళ్లతో గీకకూడదు..

–వెలుగు.. లైఫ్​–