పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎండలు వీపరీతంగా ఉన్నా యని... పెళ్లిళ్లకు ఎలాగంటే అలా వెళ్లలేరు. కాస్తయినా మేకప్ టచ్ ఉండాల్సిందే .ఒక పక్క చెమటలు కారుతుంటే.. మేకప్ వేసు కోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బిందాస్ మేకప్ చేసుకోవచ్చు. మేకప్ వేసుకునే ముందు తప్పనిసరిగా ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అలంకరణకు ముందు ముఖాన్ని ఐసు ముక్కతో కాసేపు రుద్దాలి. తరువాత మెత్తని వస్త్రంతో చర్మాన్ని శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది.
అలాగే బేసిక్ క్రీం, మాయిశ్చరైజర్ రాసుకున్న తరువాత ఫౌండేషన్ వేసుకోవాలి. వీలైతే కాసేపు మర్దన చేసిన తర్వాత ఫౌండేషన్ రాయాలి. వీలైనంత వరకు లిక్విడ్, మాయిశ్చరైజర్ ఫౌండేషన్స్ ఎంచుకోవాలి. చాలామంది ఫౌండేషన్ ముఖానికి చక్కగా రాసుకుంటారు. అయితే చెవులు, మెడకు ఏదో మొ క్కుబడిగా వేసుకుంటారు. కానీ ముఖానికి ఎలాగైతే జాగ్రత్తగా వేసుకున్నారో అలానే ఆ భాగాల్లో కూడా ఫౌండేషన్ రాసుకోవాలి. అప్పుడే చూడ్డానికి అందంగా కనిపిస్తారు.