ఆధ్యాత్మికం: దీపారాధనలో ఎన్ని ఒత్తులు ఉంటే ఎలాంటి ఫలితం వస్తుంది...!

హిందువులు దాదాపుగా ప్రతి ఇంట్లో దీపారాధాన చేస్తారు.  ఇక దీపావళి రోజు అయితే కచ్చితంగా సాయంకాలం ప్రదోష కాలంలో దీపాలు వెలిగిస్తారు.  అయితే దీపానికి ఎన్ని వత్తులు ఉండాలి.. ఎన్ని వత్తులు వాడితే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి. దీపారాధనకు ఏ నూనె వాడితే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి..    దీపాన్ని ఏ దిక్కుకు పెడితే ఎలాంటి  ఫలితాలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

హిందువులు పొద్దున్నే ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెడతారు.  కొంతమంది ఉదయం ... సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాదరాధన చేస్తారు.  ఇక కార్తీకమాసంలో రోజు తెల్లవారుజామున లేచి హర హర మహాదేవ అంటూ చన్నీళ్ల స్నాన మాచరించి .. దీపారాధన చేస్తారు.  అయితే దీపారాధలో ఎన్ని ఒత్తులు ఉండాలి.. దీపారాధన ఏమి వాడాలి మొదలగు విషయాలను తెలసుకుందాం. . 

  •  ఒక వత్తి :  దీపారాధనలో ఒక వత్తిని వెలిగిస్తే ఫలితం సామాన్య శుభంగా ఉంటుంది.  ఒక వత్తి వేసి స్వర్గరస్తులైన వారి తల దగ్గర దీపం పెడతారు.  అందుకే దైవరాధనలో ఒకవత్తి వేసి దీపం పెట్టకూడదు. 
  • రెండు వత్తులు : రెండు వత్తులతో దీపారాధన చేస్తే  కుటుంబ సౌఖ్యం కలుగుతుంది.  
  •  మూడు వత్తులు : పుత్ర సుఖం కావాలంటే నిత్యం మూడు వత్తులతో దీపారాధన చేయాలి.  
  • ఐదు వత్తులు : ధనం, ధాన్యం,  సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం, అభివృద్ధి కలగాలంటే ఐదు వత్తులు వేయాలి.  ఐదు వత్తులు పంచభూతాలకు సాక్ష్యంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఎన్ని వత్తులు వాడినా.. పత్తితో చేసిన  వత్తులు మాత్రమే వాడాలి. 

  దీపారాధన విధానం 

  • ఆవు నెయ్యి : నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును. 
  •  నువ్వుల నూనె : నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు, పీడలు తొలగును.
  • ఆముదం : ఆముదముతో దీపారాధన చేసిన, దేదీప్యమానమగు జీవితం, బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధియగును.
  •  వేరుశెనగ నూనె : వేరుశెనగనూనెతో దీపారాధన  చేయకూడదు.   నిత్య ఋణములు, దు:ఖం, చోర భయం, పీడలు మొదలగునవి జరుగును.
  • నెయ్యి, ఆముదం, వేప నూనె, కొబ్బరి నూనె, యిలుప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం కలుగును.
  • వేపనూనె, నెయ్యి, యిలుపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును.
  • ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వశుభములు, శాంతి కలుగును.

 దీపాల  దిక్కుల ఫలితములు 

  • తూర్పు : కష్టములు తొలగును, గ్రహదోషములు పోవును
  •  పశ్చిమ : అప్పుల బాధలు, గ్రహదోషములు, శనిదోషములు తొలగును.
  •  దక్షిణం : ఈ దిక్కున దీపము వెలిగించరాదు ... కుటుంబమునకు కష్టము కలుగును
  •  ఉత్తరం : ధనాభివృద్ధి, కుటుంబములో శుభకార్యములు జరుగును.

 దీప వత్తుల  ఫలితములు

  • పత్తితో తయారు చేసిన వత్తులతో  దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును. 
  • అరటి నారతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును.
  • జిల్లేడు నారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు.
  • తామర నార తో దీపము వెలిగించినచో  పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును . ధనవంతులగుదురు.
  • నూతన పసుపు వస్త్రమును వత్తి మాదిరిగి చేసి దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు.

 నూతన ఎరుపు వస్త్రముతో దీపారాధన చేస్తే :- పెళ్ళిళ్ళు అగును, గొడ్రాలికి సంతానము కల్గును.
నూతన తెల్ల వస్త్రమును పన్నీరులో ముంచి ఆరబెట్టి  దీపారాధన చేస్తే  శుభకార్యములు జరుగును.
సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం, సౌభాగ్యం కలుగును.

‌–వెలుగు, ఆధ్యాత్మికం–