Health Alert: ఒక మనిషికి రోజుకు ఎన్ని కాలరీల శక్తి అవసరం..డిటెయిల్స్ ఇవే..

మన శరీరం బాగా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందించడంలో క్యాలరీలు కీలక పాత్ర పోషిస్తాయి. మనం రోజువారీగా తీసుకుంటున్న క్యాలరీలు, శక్తి వినియోగానికి కాలరీలు సమానంగా ఉన్నప్పుడు మన బాడీ వెయిట్ విషయంలో కంట్రోల్ గా ఉంటుంది. లేకుంటే బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువ. అయితే ఆరోగ్యంగా, బరువు బ్యాలెన్స్ కు రోజుకు ఎన్ని కాలరీలు అవసరం ఉంటాయి. కేలరీలు ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయి వంటి విషయాలను తెలుసుకుందాం.. 

బరువు తగ్గాలనుకునేవారికి తక్కువ క్యాలరీలను తీసుకోవడం చాలా ముఖ్యం. బరువు పెరగాలనుకునేవారికి క్యాలరీలు ఎక్కవ అవసరం ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని క్యాలరీల అవసరమో తెలుసుకుందాం. 

Also Read :- ఇడ్లీతో ఈజీ స్నాక్స్

క్యాలరీలు అనేది తినే ఆహారం నుంచి ఉత్పన్నమయ్యే వేడి లేదా శక్తి. బాడీలో అవయవాల అసంకల్పిత విధులు, ఆడటం, తినడం, నడవడం వంటి స్వచ్ఛందంగా పనిచేసే వాటికా చాలా అవసరం.  అంతేకాదు అన్ని శరీర కణాలు, కణజాలాలు, అవయవాలకు శక్తి అవసరం.

క్యాలరీ అనేది 1 గ్రాముల నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమైన శక్తి అని అర్థం.

1 గ్రాము కార్బోహైడ్రేట్లు 4 కిలో కేలరీలు (కిలోకాలరీలు) కలిగి ఉంటాయి
1 గ్రాము ప్రోటీన్‌లో 4 కిలో కేలరీలు ఉంటాయి
1 గ్రాము కొవ్వులో 9 కిలో కేలరీలు ఉంటాయి 

ఎవరికి ఎన్ని కేలరీలు అవసరం?
స్త్రీకి సుమారు 1,400 నుంచి 1,600 కిలో కేలరీలు అవసరం కావచ్చు.పురుషుడికి 1,800 నుంచి 2,000 కిలో కేలరీలు అవసరం కావచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. ఎత్తు, శరీర బరువు, ఆకారం, మొత్తం ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. 65 కిలోలున్న పురుషుడికి 2,080 కిలో క్యాలరీ,55 కిలోల బరువున్న స్త్రీలకు 1650 కిలో కేలరీలు అవసరమని డాక్టర్ కార్తిగై చెబుతున్నారు.  

0 నెలల నుండి 18 సంవత్సరాల పిల్లలకు రోజువారీ కేలరీలు

  • 0-6 నెలలు: 90 కిలో కేలరీలు/కిలో
  • 7-12 నెలలు: 80 కిలో కేలరీలు/కిలో
  • 1-3 సంవత్సరాలు: 83 కిలో కేలరీలు / కిలోలు
  • 4-6 సంవత్సరాలు: 74 కిలో కేలరీలు / కిలోలు
  • 7-9 సంవత్సరాలు: 67 కిలో కేలరీలు / కిలోలు
  • 10-నుంచి 12 యేండ్ల పిల్లలకు: బాలురకు 64 కిలో కేలరీలు / కిలోలు, బాలికలకు 57 కిలో కేలరీలు / కిలోలు
  • 13-నుంచి 15యేండ్ల పిల్లలకు: అబ్బాయిలకు 57 కిలో కేలరీలు / కిలోలు , బాలికలకు 49 కిలో కేలరీలు / కిలోలు
  • 16-నుంచి18 యేండ్ల పిల్లలకు: బాలురకు 52 కిలో కేలరీలు / కిలోలు ,బాలికలకు 45 కిలో కేలరీలు / కిలోలు

నోట్ : కిలో కేలరీలు (తరచుగా పెద్ద క్యాలరీగా సూచిస్తారు)  1,000 చిన్న కేలరీలకు సమానం. రోజువారీగా ఆహారంలో కేలరీలు  గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా కిలో కేలరీలు అని అర్థం.