Good Health : రోజుకు అరగుప్పెడు అవిసె గింజలు తినండి.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!

కొందరు ఎంతటి డైట్ మెయింటెయిన్ చేసినా.. బరువు తగ్గడంలో మాత్రం విఫలం అవుతుంటారు. అయితే, రోజుకి అరగుప్పెడు అవిసె గింజల్ని తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. నిపుణులు. అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీనివల్ల ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు.

అవిసెగింజలతో శరీరానికి అదనపు లాభాలున్నాయి. వీటిని రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పైగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు మధుమేహాన్ని నియంత్రించగల శక్తి అవిసె గింజల్లో ఉంది. ఒకవేళ అవిసెలను నేరుగా తినడానికి కష్టమైతే పిండి చేసుకొని, దానిలో బెల్లం కలిపి.. లడ్డూలా చుట్టుకుని రోజుకొకటి తింటే సరిపోతుంది. వీటికి ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దప్రేగులోని సమస్యలను నిరోధించగలిగే శక్తి కూడా ఉంది. అవిసె నూనెను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.