రోజు వారి ఆహారంలో పాలు చాలా అవసరం. ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి పిల్లల నుంచి పెద్దల దాకా పాలను ఏదో రూపంలో తీసుకుంటారు. కానీ ఈ రోజుల్లో స్వచ్ఛమైన పాలు దొరకడం కష్టం కాబట్టి పాల ప్యాకెట్లే దిక్కు.ప్యాకెట్ పాలు అయినా, గేదె పాలు అయినా మరిగించాకేతాగాలి అనుకుంటారు ఎవరైనా.. అయితే పాల ప్యాకెట్ల లోని పాలు మరిగించ కూడదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఎందుకంటే..
సాధారణంగా ఏ దెయిరీలో అయినా పాలను ఎక్కువ ఉష్ణోగ్రతకు మరిగిస్తారు. 161.6 డిగ్రీల ఫారెన్ హీట్ టెంపరేచర్ పాలను మరిగించి వెంటనే 15 సెకండ్లలోనే చల్లారుస్తారు. ఇలా చేయడాన్ని పాశ్చరైజేషన్ అంటారు. దీని వల్ల పాలలో ఉండే హానికారక సాల్మొనెల్లా బాక్టీరియా తొలగిపోతుంది. ఇలా ఒకసారి మరిగించాక ఆ పాలను ప్యాక్ చేస్తారు. అనంతరం వాటిని మనం మళ్లీ మరిగిస్తే వాటిల్లో ఉండే పోషకాలు నశిస్తాయి అంటున్నారు శాస్త్రవేత్తలు.
కాబట్టి ప్యాకెట్ పాలను మళ్లీ మరిగించాల్సిన పనిలేదు. కాకపోతే సింపుల్గా కొంచెం వేడి చేసుకుని ఉపయోగిస్తే చాలు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా గేదె పాల విషయానికొస్తే.. వాటిని కచ్చితంగా మరిగించాలి. అప్పుడే ఆ పాలల్లో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా నశిస్తుంది.