వంట నూనెను ఎలా నిల్వ చేయాలో తెలుసా...

కిచెన్​ లో అత్యంత ముఖ్యమైన పదార్థం ఆయిల్​.. ఇది లేకుండా దాదాపు ఏ కర్రీ చేయలేము...  రెగ్యులర్​ గా వాడే వంట సామాగ్రిని  అందుబాటులో ఉంచుకుంటారు. అలాంటి  ఆయిల్​ను కిచెన్​ లో  ఎక్కడ నిల్వ చేయాలి. ..ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం. . .

  • ప్రతి ఒక్కరూ వంట నూనెను సులభంగా అందుబాటులో ఉంచడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అన్ని వంటల తయారీకి నూనె చాలా అవసరం. దాదాపు అందరూ దీనిని స్టవ్​ దగ్గర నిల్వ చేస్తారు.  ఇలా చేయడం చాలా ఆరోగ్య పరమైన ఇబ్బందులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  
  • గ్యాస్ స్టవ్ దగ్గర ఆయిల్ బాటిళ్లను ఉంచడం వల్ల ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఇది ఆయిల్ రాన్సిడ్ గా  మారుతుంది. రాన్సిడ్ ఆయిల్ లు  జీర్ణ సమస్యలను కలిగిస్తాయి .   ఇలాంటి నూనెలో విటమిన్లు B, E లు తగ్గుతాయని ...ఇది క్యాన్సర్ కణాల పుట్టుకకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • ప్లాస్టిక్​ బాటిల్స్​ బదులుగా గాజు పాత్రల్లో నిల్వ చేయాలి.  ఆయిల్ బాటిల్ తెరిచిన తర్వాత, గాలి ప్రవేశించకుండా గట్టిగా మూసివేయాలి. దాని నాణ్యతను కాపాడుకోవడానికి నూనెను వేడి తగలని చోట, దూరంగా చిన్నగది లేదా క్యాబిన్ వంటి చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి. గాలి, కాంతి నుండి రక్షించడానికి రసాయన ప్రతిచర్యలకు గురికాకుండా ఉండటానికి గట్టిగా కప్పి ఉంచండి.వంట నూనెలు అధిక కొవ్వు పదార్థాలతో ఉంటాయి.
  •  మీరు బాటిల్ లేదా ప్యాకెట్ తెరిచిన వెంటనే రసాయన ప్రక్రియకు లోనవుతాయి. అధిక ఆక్సీకరణ కారణంగా దీనిలో మార్పులు వస్తాయి. మీ శరీరంలో రాన్సిడ్ ఆయిల్ చేరడం అకాల వృద్ధాప్యం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, భారీగా బరువు పెరగడానికి దారితీస్తుంది. స్టవ్ దగ్గర నూనె వదిలేస్తే టైప్-2 డయాబెటిస్, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
  • నూనె బాటిల్ ను గాలి, వెలుతురు సరిగ్గా తగిలే చోట ఉంచి, దానిపై మూతను గట్టిగా పెట్టి ఉంచాలని అంటున్నారు.  వాడిన నూనెను మళ్లీ వాడితే ఊబకాయం, జీర్ణ సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు  త్వరగా వృద్ధాప్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. 
  • కొంతమంది నూనెను 10 ప్యాకెట్లు లేదా.. 5 కిలోలు.. 10 కిలోల టిన్స్​ కొంటారు.  అలాంటప్పుడు ఆ నూనె ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాల్సి వస్తుంది.  ఇలాంటప్పుడు గడువు తేది చూసి కొనుగోలు చేయాలి.  అయితే నూనె ఎక్కువ కాలం ప్యాకెట్లలో గాని.. డబ్బాల్లో గాని నిల్వ ఉంటే వేడికి ఆక్సీకరణ చెంది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నెలకు సరిపడా మాత్రమే ఆయిల్​ కొనుగోలు చేయడం మంచిది. 
  • ఆలివ్ నూనెను కాంతి, వేడి నుండి దూరంగా నిల్వ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు ఈ నూనెను 3 నెలలు ఉపయోగించవచ్చు.నూనె చల్లని వాతావరణంలో నిల్వ చేయాలి.  లైటింగ్ పడని ప్రదేశాల్లో ఉంచాలి.  ఎందుకంటే  -  కాంతి చమురును త్వరగా క్షీణింపజేస్తుంది, కాబట్టి  నూనెలను  ముదురు గాజు సీసాలలో మాత్రమే కొనుగోలు చేయాలి. ఒకవేళ ప్యాకెట్లు కొనుగోలు చేస్తే వెంటనే అలాంటి సీసాల్లో భద్రపర్చుకోవాలి. 
  • ఇటీవల నూనెల్లో కల్తీ, నకిలీ నూనెలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బ్రాండెడ్ నూనెలను నకిలీవి చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. చాలా నూనెలు కల్తీ కావడం వల్ల ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం పడుతోంది. ఇది క్యాన్సర్, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అందుకే సరైన నూనె ఎంచుకుని వాడాలి. అవసరమైతే నూనెను పరీక్షించాలి. ఎక్కువగా ఆయిల్ తినకుండా ఉండాలి.