సినిమా వాళ్లు అంత ఫాస్ట్గా ఎలా బరువు పెరుగుతుంటారో.. తగ్గుతుంటారో ఇన్నాళ్లకు తెలిసింది..!

కొత్త సంవత్సరం రాబోతోంది అంటే.. కొత్త ఆశలు, ఆశయాలను నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది. మరీ ముఖ్యంగా ఎప్పటినుంచో మనసులో ఉండిపోయిన ఆలోచనలను ఆచరణలో పెట్టే టైం వచ్చేసింది అని అనుకుంటాం. కానీ, అందులో పర్ఫెక్ట్​గా ఆచరించేవాళ్లు మాత్రం చాలా తక్కువ ఉంటారు. మరీ ముఖ్యంగా కొత్త ఏడాది అనగానే ఫిట్​నెస్ గోల్స్ పెట్టుకోవడం చాలా కామన్​. ఏడాది చివరికి ‘ప్చ్​.. వర్కవుట్​ కాలేదు.

నెక్స్ట్​ ఇయర్ అయినా ట్రై చేద్దాం!’ అనుకుంటారు. ఇలా ఏండ్లకు ఏండ్లు గడిపేసేవాళ్లు కూడా మనలో చాలామందే ఉంటారు. అయితే, ఫిట్​నెస్ విషయంలో పెట్టుకున్న గోల్​ రీచ్ అవ్వలేదు. ప్లాన్స్ వర్కవుట్ కాలేదు అనుకునేవాళ్లు చేయాల్సిందల్లా ఒక్కటే.. వర్కవుట్స్​. అవును... ఫిట్​గా ఉండాలంటే క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేయాలంటున్నారు ఎక్స్​పర్ట్స్. వివరంగా  తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. 

‘‘ఫిట్​గా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ, ఫిట్​నెస్​ కోసం శరీరాన్ని కష్టపెట్టాలంటే మాత్రం మనసు ఒప్పదు. కాదు.. కాదు.. బద్ధకం కూడా కావొచ్చు. తీరిక, ఓపికా లేకపోవచ్చు. కారణమేదైనా ఫిట్​నెస్ విషయంలో మాత్రం టైం కేటాయించకపోతే ఎలా? ఈసారైనా ఫిట్​గా ఉండడానికి మార్గాలు వెతకాలి కదా. ఫిట్​గా తయారవ్వడం మీ గోల్ అయితే... ఇలా చేరుకోండి”అంటున్నారు
డాక్టర్ మోహన్​ లాల్​.  ఇంకా ఏం చెప్పారంటే.. 

ఫిట్​నెస్​ గోల్

ఫిట్​నెస్​ గోల్ పెట్టుకోవాలి అనుకునేవాళ్లు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే.. వర్కవుట్స్ స్టార్ట్​ చేయకముందే వాళ్ల ఆరోగ్యం ఎలా ఉంది? ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఉంటే.. వాటికి తగ్గ వర్కవుట్స్ ఏం చేయాలి? అనే విషయాలు చూసుకోవాలి. వాటితోపాటు ఫిజికల్, మెంటల్​, ఎమోషనల్​గా ఎంత స్ట్రాంగ్​గా ఉన్నారో దాన్ని బట్టి వాళ్లు గోల్​ పెట్టుకోవాలి. ఫిజికల్​ యాక్టివిటీస్ చేయాలనుకున్నప్పుడు ఏజ్​, హైట్​, వెయిట్, హార్ట్​ బీట్ రేట్, బ్రీతింగ్​, మెటబాలిజమ్ ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. ఉదాహరణకు డయాబెటిస్​, థైరాయిడ్, ఒబెసిటీ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు వాళ్ల హెల్త్ కండిషన్​ని బట్టి వర్కవుట్స్ అనేవి డిజైన్​ చేసుకోవాలి. ఆ తర్వాతే వర్కవుట్స్ మొదలుపెట్టాలి. 

ఫిజిక్​ మెయింటెయిన్ 

ఈ మధ్య ఎక్కువగా వెయిట్​ లాస్​ కోసం వర్కవుట్స్ చేస్తున్నారు. ఇంకా చాలామంది చేయాలనుకుంటున్నారు. అయితే, చూడ్డానికి నాజూగ్గా ఉన్న కొందరు ఎప్పటికీ అలాగే మెయింటెయిన్​ చేయాలి అని గోల్ పెట్టుకుంటున్నారు. అలాంటివాళ్లు ఎక్కువ బరువులు ఎత్తడం వంటి హార్డ్​ వర్కవుట్స్​కి దూరంగా ఉంటారు. ఇది ఎక్కువగా ఆడవాళ్లు ఫాలో అవుతుంటారు. ఉదాహరణకు చెప్పాలంటే.. సెలబ్రెటీలు వాళ్ల ఫిజిక్​ని మెయింటెయిన్ చేయడానికి జిమ్​లో చాలా కష్టపడుతుంటారు. అయితే వాళ్లు ఒక్కో ప్రాజెక్ట్ కోసం కొన్నిసార్లు బరువు పెరగడం లేదా తగ్గడం చేస్తుంటారని తెలిసిందే. అయినా వాళ్ల బాడీ ఎలా ట్రాన్స్​ఫామ్​ అవ్వగలుగుతుంది? అనే డౌట్​ వస్తుంటుంది చూసేవాళ్లకు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఒకేలాంటి డైట్, వర్కవుట్స్​తో బాడీ ట్రాన్స్​ఫర్మేషన్ అనేది అందరికీ వర్కవుట్ కాదు. ఒంటి తీరు, ఆహార అలవాట్లు, వర్కవుట్లు చేసే విధానాల్లో మార్పులు ఉంటాయి. 

కొందరు బరువు పెరగాలనుకుంటారు. అందుకోసం జంక్​ ఫుడ్స్ తినడం, వర్కవుట్స్ మానేసి బాడీకి ఫుల్​గా రెస్ట్​ ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇవి అన్​ హెల్దీ హ్యాబిట్స్. ఇలా చేయడం వల్ల అనారోగ్యాల బారిన పడతారే తప్ప.. మరే ఉపయోగం ఉండదు. కాబట్టి వాళ్ల హెల్త్​ కండిషన్​ని బట్టి ఫుడ్​ తీసుకోవాలి. ఏది తీసుకున్నా బ్యాలెన్స్​డ్​ డైట్​ తీసుకోవాలి. బరువు పెరగాలన్నా ఫిట్​గా ఉంటూనే పెరగాలి. దానికి తగిన వర్కవుట్స్ చేస్తూ వెయిట్ గెయిట్ అవ్వాలి. అలా చేస్తే ఫిట్​నెస్ మెయింటెయిన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. 

హెల్దీ హ్యాబిట్స్.. 

పొద్దున్నే లేవాలి. ప్రతిరోజు ఎక్సర్​సైజ్ చేయాలి. హెల్దీ ఫుడ్ తినాలి. టైంకి నిద్రపోవాలి. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ పాటించరు. దానివల్ల లైఫ్​ స్టయిల్​లో మార్పులు వస్తాయి. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు.. పొద్దున లేచి బాత్​రూమ్​కి వెళ్తే.. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రెండు మూడు నిమిషాల్లో బయటకు రావాలి. మలబద్ధకం వంటి సమస్యల వల్ల కొందరు ఎక్కువ టైం తీసుకోవచ్చు. కానీ, అసలు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అయితే కొందరు ఏ ప్రాబ్లమ్ లేకపోయినా బాత్​రూమ్​లో ఎక్కువ టైం ఉంటారు. అందువల్ల కొలన్​ (పెద్దపేగు) క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటివి అలవాట్లు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి హెల్దీ హ్యాబిట్స్ పాటించాలి.  

వింటర్​లో బెస్ట్!

ఫిట్​నెస్ గోల్ పెట్టుకునేవాళ్లు కొత్త ఏడాది నుంచే మొదలుపెట్టాల్సి ఉంటుంది. అయితే వింటర్​లో వర్కవుట్స్ చేయడం చాలా మంచిది. బాడీ కండిషన్​ బాగుంటుంది. కాకపోతే ఈ సీజన్​లో ఉదయం పూట ఆరు తర్వాతే ఎక్సర్​సైజ్​ చేయాలి. బయటికి వెళ్లి చేసేవాళ్లు ఏడు గంటలకు వెళ్లాలి. అంతకంటే ముందు చేస్తే మాత్రం రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా తెల్లవారుజామున చలికి గుండె తట్టుకోలేదు. దానివల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని చలికాలంలో ఈ టైమింగ్స్​ ఫాలో అవ్వాలి.

అలాగే సీజన్​ని బట్టి వర్కవుట్స్ మారుస్తూ ఉండాలి. ప్రతి సీజన్​లో ఒకేలాంటి వర్కవుట్స్ చేయకూడదు. ఉదాహరణకు ఎండాకాలంలో కార్డియో ఎక్సర్​సైజ్ చేయలేం. ఎందుకంటే బాడీ డీహైడ్రేషన్​కి గురవుతుంది. గ్లూకోజ్ లెవల్స్ తగ్గిపోతాయి. ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి వర్కవుట్స్ మార్చాలి. వాకింగ్, రన్నింగ్ వంటివి మాత్రమే ఎక్సర్​సైజ్ కాదు. మనం రోజూ చేసే పనులన్నీ ఫిజికల్ యాక్టివిటీ కిందకే వస్తాయి. కారు, బైక్​ నడపడం, ఇంట్లో ఏవైనా పనులు చేయడం, అంతెందుకు కూర్చుని మాట్లాడడం వల్ల కూడా క్యాలరీలు కరుగుతాయి.

గోల్స్ వల్ల లాభాలు ఇవే..

లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల పెరుగుతుంది. ప్రతి పనీ ఫోకస్​గా చేయగలుగుతారు. సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరగవుతుంది.  ఒత్తిడి, యాంగ్జైటీ, అలసట వంటి నెగెటివ్ ఫీలింగ్స్ తగ్గి, పాజిటివ్​గా ఆలోచించడం మొదలుపెడతారు. అన్నింటికన్నా ముఖ్యంగా మీపై మీకున్న నమ్మకం మరింత బలపడుతుంది. ఏదైనా సాధింగలను అనే స్ఫూర్తి కలుగుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మరింకేం... వచ్చే ఏడాదైనా మీ ఫిట్​నెస్ గోల్​ రీచ్ అవ్వండి. ఆల్​ ది బెస్ట్​!

యాక్టివ్​ లైఫ్​ స్టయిల్ 

యాక్టివ్​ లైఫ్​ స్టయిల్ అలవాటు చేసుకోవాలి. పూర్వకాలంలో కాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులు అనేవి వినేవాళ్లు కాదు. అలాగని వాళ్లు హెల్దీగా ఉండే ఫుడ్​ తీసుకున్నారని కూడా చెప్పలేం. ఎందుకంటే వాళ్ల స్థోమతను బట్టి ఆహార అలవాట్లు ఉండేవి. కానీ రోజంతా వాళ్లు శారీరక కష్టం చేసేవాళ్లు. కాబట్టి ఎండ ద్వారా డి– విటమిన్ అందేది. టైంకి తినడం, సరిపడా నిద్రపోవడం వల్ల ఫిట్​గా ఉండేవాళ్లు. వాళ్ల లైఫ్ స్టయిల్ హాయిగా గడిచిపోయేది. 

కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం లేటుగా లేస్తున్నారు. ఇంకొందరేమో రాత్రుళ్లు జిమ్​కెళ్లి కష్టపడుతున్నారు. అయినప్పటికీ టైంని ఏదో ఒక విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్లు హెల్దీగా కూడా ఉండగలుగుతున్నారు. దానికి తగ్గట్టే వాళ్ల లైఫ్​ స్టయిల్ ఉంటుంది. దానివల్ల ఇబ్బంది లేదు. కానీ, ఉదయంపూట చేసే వర్కవుట్స్​ మంచి ఫలితాన్నిస్తాయి.

తొందరపడొద్దు.. శృతి మించొద్దు!

గోల్ పెట్టుకుంటే చాలామంది త్వరగా రిజల్ట్​ రావాలని కోరుకుంటారు. కానీ, ఫిట్​నెస్ విషయంలో తొందరపడకూడదు. కాస్త టైం పట్టినా అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. అంతేగానీ, త్వరగా రీచ్ అవ్వాలని షార్ట్​ కట్స్ వెతకకూడదు. దానివల్ల తిరిగి సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొందరు గోల్ రీచ్​ అయ్యాక సడెన్​గా వర్కవుట్ మానేస్తారు. అది కూడా పొరపాటే. వర్కవుట్ అనేది డైలీ లైఫ్​లో భాగమవ్వాలి. తిండి, నిద్ర ఎలాగో రోజూ ఎక్సర్​సైజ్ కూడా అలాగే అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే హెల్దీ లైఫ్​ స్టయిల్ అలవాటు అవుతుంది. అయితే, ఏదీ శృతి మించకూడదు. లిమిట్ ప్రకారమే ఉండాలి. డబ్ల్యూహెచ్​ఓ ప్రకారం.. ఆరోగ్యకరమైన వ్యక్తి వారానికి నాలుగ్గంటలు ఎక్సర్​సైజ్ చేయాలి. 

టీనేజర్లు గంటసేపు, ముసలివాళ్లు 45 నిమిషాలు చేయాలి. వర్కవుట్స్ చేయడానికి మోటివేషన్ వచ్చేలా సాంగ్స్ వింటూ చేసుకోవచ్చు. మెంటల్, ఫిజికల్, ఎమోషనల్​గా ఫిట్​గా ఉండాలి. తినే ఫుడ్​ ఎలా ఉంది? లైఫ్​ స్టయిల్ఎలా ఉంది? మన ఫిట్​నెస్ గోల్ ఏంటి? దానికోసం టైంని ఎలా మెయింటెయిన్ చేయాలి?  దానిని బట్టి వర్కవుట్స్ డిజైన్ చేసుకోవాలి. అన్నింటికన్నా ముందు కష్టపడాలి అని బలంగా ఫిక్స్​ అవ్వాలి. ఎవరేమన్నా వినకుండా ముందుకెళ్లగలను అనే సెల్ఫ్​ కాన్ఫిడెన్స్ ఉంటే కచ్చితంగా మంచి రిజల్ట్స్ చూస్తారు. గోల్ రీచ్ అవ్వకపోయినా అవ్వగలం అనే నమ్మకం క్రమంగా బలపడుతుంది. ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటారు. హెల్త్ పరంగా ఎంత శ్రద్ధ వహిస్తే.. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టకుండా బతికినన్నాళ్లు హెల్దీగా, హ్యాపీగా ఉంటారు. 

-డాక్టర్ బి. మోహన్ లాల్ హెల్త్​ & ఫిట్​నెస్ ట్రైనర్, సెలబ్రెటీ & సర్వీసెస్​ టీం