కరీంనగర్ జిల్లాలో అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం 

జమ్మికుంట, వెలుగు : ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో ఓ పెంకుటిల్లు దగ్ధమైంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన మిరియాల రాజమౌళి.. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో బుధవారం రాత్రి కుటుంబసభ్యులంతా ఊరెళ్లారు. అనంతరం అర్ధరాత్రి రాజమౌళి ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించారు. 

ప్రమాదంలో గ్యాస్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేలడంతో మంటలు తీవ్రత పెరిగింది. ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారంతోపాటు, సామగ్రి, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలాన్ని తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణి పరిశీలించి పంచనామా చేశారు.