వరంగల్ జిల్లాలో కూలిన ఇల్లు..తృటిలో తప్పిన ప్రమాదం!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఇల్లు కూలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. కొండేటి రవి రజితలకు చెందిన ఇంటి గోడ కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో భార్యాభర్తలు సహా ఇద్దరు పిల్లలు ఉండగా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

తమను ప్రభుత్వం ఆదుకోవాలని దంపతులు వేడుకున్నారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ కొండేటి అనితా సత్యం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం వెంటనే కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. - వర్ధన్నపేట, వెలుగు