అయ్యో పాపం : భారీ వర్షాలకు కళ్ల ముందే కూలిన ఇల్లు

భారీ వర్షాలు, వరదలు సామాన్యుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇప్పటికే వరదలకు కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా.. ఇప్పుడు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలిపోతున్నాయి. అలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ALSO READ : గ్రేట్​: చిన్నారి సాయి సింధు రూ. 3 వేలు వరద సాయం

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో భారీ వర్షాలకు వడ్ల సత్తయ్య, ఈశ్వరయ్యకు చెందిన ఇల్లు కూలిపోయింది. ప్రమాదకరంగా ఇల్లు ఉండటంతో.. ఇంట్లోని వారు బయటకు వచ్చేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఇల్లు కూలిపోవటం వీడియోలో రికార్డ్ అయ్యింది.