దీపం పెట్టిన తరువాత ఇల్లు శుభ్రం చేస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

హైటెక్​ యుగంలో  జనాలు బిజీ బిజీ లైఫ్​ గడుపుతున్నారు.  ఎంతగా అంటే  మంచంపైనుండి లేస్తూనే హలో అని ఫోన్​ చేత్తో పట్టుకొని ఉద్యోగ విధుల్లో మునిగిపోతున్నారు. ఇక ఆఫీసుకు వెళ్తే ఎప్పుడు ఇంటికి వస్తారో కూడా తెలియదు. ప్రస్తుత రోజుల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో స్త్రీలకు కనీసం ఇంటిని శుభ్రపరచుకోవడానికి పూజలు చేయడానికి కూడా సమయం ఉండటం లేదు. ఉదయం లేవగానే తొందర తొందరగా పనులు పూర్తి చేసుకోవడం కనీసం ఇంటిని శుభ్రపరిచే సమయం లేకపోవడంతో అలాగే ఆఫీసులకు వెళ్లిపోతున్నారు. ఇక సాయంత్రం ఎప్పుడో సూర్యోదయం తర్వాత ఇంటికి వచ్చి ఆ సమయంలో ఇంటిని ఊడ్చుకొని శుభ్రం చేసుకుంటున్నారు. అయితే దీపం పెట్టిన తర్వాత ఇల్లు శుభ్రం చేయడం అన్నది ఈ రోజుల్లో బాగా ఫ్యాషన్ అయిపోయింది.

ఇక  ఇంట్లో పెద్దవారు ఉంటే.. పొద్దున్నే లేచి కాలకృత్యాల అనంతరం దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటారు. ఇక ఆ తరువాత  ఎవరో పని మనిషి వచ్చి ఇంటిని శుభ్రం చేస్తారు.   కానీ దీపం పెట్టిన తర్వాత అలా ఇంటిని శుభ్రం చేయడం అస్సలు మంచిది కాదు అంటున్నారు పండితులు. మామూలుగా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో పూజ మందిరంలో తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆ తర్వాత పని మీద వెళ్తే శుభ ఫలితాలు కనిపిస్తాయని శాస్త్రం చెబుతోంది. కానీ ప్రస్తుత రోజుల్లో అలా చేయడానికి కూడా సరైన సమయం ఉండటం లేదు.

స్త్రీ, పురుషులు ఇద్దరూ కలిసి ఉద్యోగానికి వెళ్లడంతో ఉదయాన్నే పూజ చేసి వెళ్తారు.  వారు ఉద్యోగానికి వెళ్ళిన తరువాత పనివాళ్ళు వచ్చి ఇంటికి శుభ్రపరుస్తారు. ఒకవేళ స్త్రీ ఇంట్లో ఉన్న కూడా భర్త, పిల్లలు ఆఫీసుకు, స్కూల్ కి వెళ్లే సమయం వరకు ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేయడానికి కుదరదు.భర్త ఉదయాన్నే పూజ చేసి ఆఫీసుకు వెళ్లిన తర్వాత ఆమె ఇంటిని శుభ్రపరచుకుంటుంది. ఇలా అస్సలు చేయకూడదు. శాస్త్ర ప్రకారం ఇల్లు మొత్తం శుభ్రపరిచిన తర్వాత స్నానం చేసి ఆ తరువాత పూజ చేయడం మంచిది.

అంతేకానీ దీపారాధన వెలుగుతున్న సమయంలో ఇంటిని అసలు శుభ్రపరచకూడదు.దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్ర పరచుకోవచ్చు. దీపం వెలుగుతుండగా ఇంటిని శుభ్రం చేస్తే దేవతల ఆగ్రహానికి గురవుతాము. దాంతో లేనిపోని సమస్యలు మొదలవుతాయి. అనవసరంగా అన్నింటిలోనూ నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఏదైనా కూడా సక్రమంగా సరైన పద్ధతిలో క్రమంగా చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు.

ఉదయం 6 గంటల లోపు పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. సూర్యోదయానికి కంటే ముందు అమృత ఘడియల్లో లేచి తలంటు స్నానం చేసి పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఉదయం 6 లోపు పూజ చేయడానికి కుదరని వాళ్ళు కనీసం 7 గంటల లోపు అయినా పూజ చేయడం మంచిది. దీపారాధన చేసిన తర్వాత ఇల్లు శుభ్రపరచకూడదు. ఇది శాస్త్రానికి విరుద్ధం. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.