ఫుడ్ బాగోలేదు..చిన్న హోటల్ నుంచి రెస్టారెంట్ దాకా ఇదే తీరు

  • క్వాలిటీ లేని ఫుడ్ తిని అనారోగ్యాల పాలైతున్న కస్టమర్లు
  • ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని ఆగ్రహం  
  • సిటీ శివారు ప్రాంతాల్లో ఎలాంటి తనిఖీల్లేవ్  
  • ఎల్ బీనగర్ జోన్ లో ఫుడ్ సేప్టీ ఆఫీసర్ పోస్టు ఖాళీ

ఎల్​బీ నగర్,వెలుగు : చిన్న హోటల్ నుంచి పెద్ద హోటళ్లు, కార్పొరేట్ స్థాయి రెస్టారెంట్లలోనూ ఫుడ్ నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదు. క్వాలిటీ లేని ఫుడ్ వడ్డిస్తున్నట్లు కస్టమర్లు మొత్తుకుంటుండగా.. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేఫ్టీ, శానిటేషన్ అధికారులు పట్టించుకోకపోతుండడంపై విమర్శలు వస్తున్నాయి. కల్తీ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికారుల్లో మార్పు రావడంలేదు.  సిటీ సెంటర్ లో హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారులు విస్తృతంగా దాడులు చేస్తుండగా..

సిటీ శివారు ప్రాంతాల్లో ఎలాంటి తనిఖీలు లేవు. కస్టమర్ నుంచి ఫిర్యాదు వస్తే.. అది కూడా సెంట్రల్ సిటీ నుంచి అందితేనే తనిఖీలకు వెళ్తున్నారు. ఇదీ బల్దియా పరిధి ఎల్ బీనగర్ జోన్ లోని పరిస్థితి. సర్కిల్ పరిధిలో ఎక్కడ కూడా హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేయడంలేదు.  సర్కిల్ లో ఒక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా లేరు. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందినప్పుడే వెళ్లి నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు.  హోటళ్లు, రెస్టారెంట్లలో కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లీన్ గా ఉండేలా, ఫుడ్ కోసం వాడే పదార్థాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమి పట్టన్నట్లు ఉంటుండగా..

కస్టమర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శివారు ప్రాంతాలు కావడంతో అడ్డగోలుగా కొత్త హోటల్స్ కూడా వెలుస్తున్నాయి.  ఎలాంటి లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నా రు.  ఫుడ్ సేఫ్టీ అధికారి లేకపోవడంతో శానిటేషన్ విభాగానికి చెందిన కొందరు సిబ్బంది మామూళ్లు తీసుకుంటూ.. తనిఖీలు చేయడంలేదని కస్టమర్లు ఆరోపణలు చేస్తున్నారు. 

అడ్డగోలుగా స్ట్రీట్ సైడ్ ఫుడ్ 

స్ట్రీట్ సైడ్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు ఇస్తున్నామని చెప్పి అడ్డగోలుగా వండుతున్నారు. వాడే నూనె నుంచి బియ్యం, కూరగాయలు,  మాంసం అంతా థర్డ్ పార్టీ నుంచే తెస్తున్నారు. ఓ ముఠాకు చెందిన వ్యక్తి రోడ్డు వెంట చిన్న హోటల్స్ పెట్టి కూలీలతో నడిపిస్తూ ఫుడ్ నాణ్యత పాటించడం లేడు. దీంతో జనం అనార్యోగాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. 

మున్సిపాలిటీల్లోనూ అదే తీరు

 శివారు మున్సిపాలిటీల్లో కొత్త హోటల్స్, రెస్టారెంట్స్ ఎక్కువగా వెలుస్తున్నాయి. వాటికి ఎలాంటి అనుమతులు ఉండడం లేదు. సరైన నాణ్యతతో కూడా ఫుడ్ ను వండడంలేదు. అడ్డగోలుగా ఇష్టమొచ్చినట్టుగా కల్తీ సరుకులతో ఫుడ్ తయారు చేస్తున్నారు. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అయినా అధికారులు  పట్టించుకోవడం లేదు. కనీసం తనిఖీలు కూడా చేయడం లేదు.  దీంతో కుళ్లిన వస్తువులతోనూ ఫుడ్ తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు. 

“కొద్దిరోజుల కిందట ఎల్ బీనగర్ పరిధి చింతలకుంటలోని మెక్ డోనాల్స్ రెస్టారెంట్ కు  ఓ మహిళ ఫ్యామిలీతో వెళ్లి బర్గర్ ఆర్డర్ చేసింది. ఆ ఫుడ్ లో ఈగలు వచ్చాయి. వెంటనే ఆమె జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవడంతో మీడియాకు మొరపెట్టుకున్నారు. ఆ తర్వాతే అధికారులు మెక్ డోనాల్స్ రెస్టారెంట్ కు ఫైన్ వేశారు.’’

“ రెండు వారాల రోజుల కిందట వనస్థలిపురంలోని ఓ హోటల్ కు వెళ్లిన కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అది తింటుండగా కుళ్లిన వాసన వచ్చింది. ఇదేంటని హోటల్ నిర్వాహకులు, సిబ్బందిని ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.  ఆపై బిర్యానీ మార్చి వేరేది తెస్తామని చెప్పారు.  బాగా ఆకలితో ఉన్న అతడు హోటల్  తినకుండానే బయటకు వెళ్లిపోయాడు.’’ 

గత నెల 8వ తేదీన ఎల్ బీనగర్ పరిధి 

గడ్డి అన్నారంలోని రాఘవేంద్ర హోటల్ లో ఓ వ్యక్తి పూరి ఆర్డర్ చేశాడు.  ఆ పూరి కోసం ఇచ్చిన కుర్మాలో పురుగు వచ్చింది. దీంతో బాధిత కస్టమర్ హోటల్ యాజమానిని ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పలేదు. 

 స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

హోటల్స్ లో ఫుడ్ తిని చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే హోటల్స్ పెట్టుకొని నాణ్యతలేని సరుకులతో వంటలు చేస్తున్నారు. అలాంటి హోటళ్లపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలి.

– నాగరాజు, ఎల్​బీనగర్

నాణ్యత పాటించకుంటే కఠిన చర్యలు

ఫుడ్ సేఫ్టీ గురించి ముగ్గురు సిబ్బందే ఉన్నారు.  ఫిర్యాదు అందితే వెంటనే వారిని అలర్ట్ చేసి పంపిస్తున్నాం. ఫుడ్ సేఫ్టీపై చర్యలు తీసుకుంటున్నాం. హోటల్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ తో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు. కిచెన్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి.  

 – హేమంత్ కుమార్ పాటిల్, కమిషనర్, ఎల్​బీ నగర్ జోన్