Telangana Kitchen:వేడివేడిగా నాన్ వెజ్ పరాటాలు..ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..మంచి టేస్టీగా..!

వింటర్ సీజన్ వచ్చేసింది..చలిచలిగా ఉంది..ఈ టైంలో సాయంత్రం అయిందంటే చాలు.. వేడివేడిగా ఏమైనా తినాలపిస్తుంది..కానీ ఏం తినాలి..  ఎలాంటి రెసిపీలు తింటే బాగుంటుంది. ఇలాంటి టైంలో రుచికి రుచి..ఆరోగ్యం ఉండేలా రెసిపీల కోసం చాలా మంది వెతుకుతుంటారు. అలాంటి వారికోసం వేడి వేడి నాన్ వెజ్ పరాటాలు బెస్ట్ వన్.. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 

నాన్ వెజ్ పరాటాలు తయారీ..కావాల్సిన పదార్థాలు

నాలుగు గుడ్లు, మిరియాల పొడి- ఒక టీ స్పూన్, కొత్తిమీర తరుగు - పావు కప్పు, గోధుమపిండి- ముప్పావు కప్పు, నూనె -సరిపడా, కారం- రుచికి సరిపడా, పసుపు చిటికెడు, ఉప్పు- తగినంత, అల్లం-వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, ఉల్లిగడ్డ తరుగు - ఒక టేబుల్ స్పూన్ 

తయారీ: 

స్టవ్ పై పాన్పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు, అల్లం- వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి. తర్వాత గుడ్లు కొట్టి పోసి, ఉప్పు, కారం వేయాలి. కూర బాగా మగ్గాక మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి. 

ఒక గిన్నెలో గోధుమ పిండి. ఉప్పు, కొద్దిగా నూనె, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. కలిపిన పిండిలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుని చపాతీలా వత్తాలి. ఆపైన ఒక్కో చపాతీ మధ్యలో గుడ్లు పొరటు పెట్టి. అంచులు మూసేసి మళ్లీ చపాతీల్లా వత్తాలి. 

ఇలా పిండి మొత్తాన్నీ చేశాక, వాటిని పెనంపై నూనె చల్లి రెండువైపులా కాల్చాలి. ఇంకేముందు వేడివేడి నాన్ వెజ్ పరాటా వడ్డించుకొని తినడమే. మీరూ ట్రై చేయండి.