జీజీహెచ్​లో సూపర్ స్పెషాలిటీ సేవలు

  •  సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్  

 నిజామాబాద్ సిటీ,  వెలుగు :  జిల్లా  ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు  ఆస్పత్రి సూపరింటెండెంట్​   డాక్టర్ ప్రతిమా రాజ్  తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జీజీహెచ్​లో  ఇటీవల న్యూరో సేవలు ప్రారంభించారు.  ప్రస్తుతం యూరాలజీ   సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.  ఈ వారంలో షైక్ జానీ

 రవి అనే పేషెంట్లకు కిడ్నీల్లో రాళ్లను చికిత్స ద్వారా  తొలగించామని తెలిపారు.   యూరాలజీ డాక్టర్ శబరినాథ్  ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్​ చేసినట్టు చెప్పారు.   ప్రజలు ఎవరైనా  కిడ్నీ రాళ్లతో ఇబ్బంది పడుతున్నట్లయితే జీజీహెచ్​లో  సంప్రదించాలని  కోరారు.