ఒంటికే కాదు జుట్టుకి కూడా పర్ఫ్యూమ్లు కామన్. కానీ, పదేపదే కెమికల్స్ నిండిన ఆ పర్ ఫ్యూమ్ లు వాడితే జుట్టు అందమంతా పోతుంది. పైగా డ్రైగా మారి ఇబ్బంది పెడుతుంది. అలాకాకూడదంటే నేచురల్ పర్ ఫ్యూమ్లనే వాడాలి. వాటిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు కూడా.
* ఎసెన్షియల్ ఆయిల్లో రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు, వంద మిల్లీ లీటర్ల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి చల్లటి వాతావరణంలో తేమ లేని చోట స్టోర్ చేయాలి. ఈ పర్ఫ్యూమ్ వాడితే జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉంటుంది.
* గాలి చొరబడని డబ్బాలో మల్లెపూలు వేయాలి. అందులో సరిపడా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వేసి మూతపెట్టాలి. పదహారు గంటల తర్వాత ఆ మిశ్రమాన్ని వేడిచేసి ఆయిల్ వడగట్టి, చల్లార్చాలి.
* అరకప్పు రోజ్ వాటర్ తయారుచేసుకున్న మల్లెపూల నూనెని పన్నెండు చుక్కలు వేయాలి. మూడు, నాలుగు చుక్కల ఆరెంజ్ జ్యూస్ కూడా వేసి బాగా కలిపి డబ్బాలో స్టోర్ చేయాలి.
* ఈ పర్ఫ్యూమ్ జుట్టుకి మంచి వాసన ఇస్తుంది.