కలెక్టర్ పర్యవేక్షణలో హోం ఓటింగ్

నిజామాబాద్​, వెలుగు: పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలో శుక్రవారం దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి హోం ఓటింగ్ నిర్వహించారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు పర్యవేక్షణలో సిబ్బంది దీన్ని కొనసాగించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 6 దాకా హోం ఓటింగ్​ చేపడతారు. 85 ఏండ్లు దాటిన సీనియర్​ సిటిజన్లు 859, దివ్యాంగులు 899 మంది హోం ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారు.  వేసిన ఓటు వివరాలు బయట ఎవరికీ చెప్పొద్దని కలెక్టర్ కోరారు.  

బాల్కొండ లో 'ఓట్ ఫ్రం హోం'

బాల్కొండ:85 ఏండ్లు నిండిన వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల కమిషన్ తెచ్చిన ఓట్ ఫ్రం హోం శుక్రవారం బాల్కొండ లో మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. 'ఓటు ఫ్రం హోం' కోసం దరఖాస్తు దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకు వెళ్లి ఎన్నికల సిబ్బంది ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. బాల్కొండ, శ్రీరాంపూర్, చిట్టాపూర్,కిసాన్ నగర్ లో నిర్వహించారు.

బాల్కొండ మండలంలో మొత్తం 18 మంది దరఖాస్తు చేసుకోగా శుక్రవారం 14 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎమ్మార్వో శ్రీధర్ తెలిపారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. శనివారం మిగతా వారితో ఓట్లు వేయిస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు. కార్యక్రమంలో ప్రొసిడింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, మైక్రో అబ్జర్వర్ శ్యామ్, ఏపీవో శంకర్, ఓపీవో వినోద్, రూట్ ఆఫీసర్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.