Sleep Paradox: రాత్రి 2 గంటలయినా నిద్ర రావడం లేదా.. అయితే ఇలా చేసి చూడండి

రాత్రి ఎన్ని గంటలు నిద్రపోతారు? ఈ ప్రశ్నకు సమాధానం కొందరికి 5 నుంచి 6, కొందరికి 3నుంచి 4 గంటలు. చాలా కొద్ది మంది మాత్రమే రాత్రికి 7 నుంచి 8 గంటలు నిద్రపోతారు. 6 గంటల పాటు నిద్రపోయినా, నిద్ర చాలా లోతుగా ఉండదు. పదే పదే మేల్కొంటారు. రోజుల్లో నిద్రలేమి సమస్య చాలా కామన్ అయిపోయింది. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టక చాలా మంది సతమతమవుతున్నారు.  సరిగ్గా నిద్రపోకపోవడం లేదా తక్కువ నిద్రపోవడం- భవిష్యత్తులో మధుమేహం, ఊబకాయం, డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మానసిక వ్యాధులు కూడా పెరుగుతాయి. ఈఅయితే దీనికి కొన్ని పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు నిపుణులు.ఇప్పుడు అవేంటో చూద్దాం. . .

  •  ఎడమ ముక్కు రంద్రం నుంచి శ్వాస తీసుకోవాలి. ఎలాగంటే.... ఎడమ వైపు పడుకుని చేతి వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి, ఎడమ ముక్కు రంద్రంతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శరీరంలో అధిక ఉష్ణోగ్రత వల్ల లేదా మహిళలకు మెనోపాజ్ హాట్ ఫ్లషెస్ సమస్య వల్ల నిద్ర పట్టనప్పుడు ఈ పద్ధతి పనిచేస్తుంది.
  •  కండరాలకు విశ్రాంతి కలిగిస్తే నిద్ర బాగా పడుతుంది. దీనికోసం వెల్లకిలా పడుకుని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు కాలి బొటనవేళ్లను పాదం కిందకి అదిమేలా వంచి యథాస్థితికి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలిగి మంచి నిద్రొస్తుంది.
  • మరోమార్గం నిద్ర పోకుండా ఉండేందుకు ప్రయత్నించడం. నిద్ర పట్టడం లేదు అంటుంటే ఇదేంటనుకుంటున్నారా.. అందులోనే ఉంది కిటుకు. దీన్నే 'స్లీప్ పారడాక్స్' అంటారు.ఇందులో భాగంగా కళ్లను విప్పార్చి 'నేను నిద్రపోవడంలేదు' అని పదేపదే అనుకోవాలి. సాధారణంగా మెదడు ప్రతికూల విషయాలను సరిగా ప్రాసెస్ చేయదు. అందుకని మీరు నిద్రపోవద్దని చెప్పుకునే మాటల్ని నిద్రపోవడానికి ఇచ్చే సజెషన్స్ గా భావిస్తుంది. దీనివల్ల కంటి కండరాలు కూడా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు.
  • నిద్ర కోసం సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలను తగ్గించండి. ప్రోబయోటిక్ ఆహారాలు నిద్రలేమి నుండి ఉపశమనం పొందుతాయి. ఇందుకోసం రోజూ పుల్లటి పెరుగు తినవచ్చు.
  • సాయంత్రం తర్వాత టీ, కాఫీలు తీసుకోకూడదు. టీ, కాఫీ వంటి పానీయాలలో కెఫీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. టీ, కాఫీ తాగితే అంత తేలికగా నిద్రపట్టదు.
  • సరైన సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. అలాగే నిద్రపోయే ముందు మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించే అలవాటుకు దూరంగా ఉండండి. పడుకునే గంట ముందు ల్యాప్‌టాప్, మొబైల్ ఉపయోగించడం మానేయండి. అవసరమైతే, మీరు పుస్తకాలు చదవవచ్చు, డైరీ రాయవచ్చు.
  • మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య పెరుగుతుంది. నిద్ర మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆందోళన-డిప్రెషన్ వంటి సమస్యలు ఉంటే మానసిక వైద్యుల సహాయం తీసుకోండి.

ఇక నిద్రలేమికి స్లీపింగ్ మాత్రలతో చికిత్స చేయవలసిన అవసరం లేదు. అవసరమైతే, మీరు వైద్యుడిని సంప్రదించడం ద్వారా నిద్ర మాత్రల సహాయం తీసుకోవచ్చు. కానీ మొత్తంగా నిద్రలేమి సమస్య సహజంగానే తొలగిపోతుంది. చిన్న చిన్న జీవనశైలి మార్పులు చేయడం ద్వారా మీరు నిద్రను మరింతగా పెంచుకోవచ్చు. అలాగే నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు. ఈ టిప్స్‌ పాటిస్తే మంచి నిద్రపోవడం ఖాయమంటున్నారు నిపుణులు.

ALSO READ | Health Alert : వానాకాలంలో పిల్లల ఆరోగ్యం భద్రం.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి