మాజీ సైనికులకు గూడు కట్టి ఊతమిస్తున్న హోమ్ ఫర్ హీరోస్..

సైన్యంలో విధులు నిర్వహించినా పూట గడవని పరిస్థితి వారిది. ఉండేందుకు ఇల్లు లేక రోడ్లపైనే బతుకుతున్న దుస్థితి వాళ్ళది. అలాంటి సైనికుల కోసం మహా అయితే.. వందో వెయ్యో విరాళం ఇచ్చి అదే గొప్ప అనుకుంటాం. కానీ.. కెనడాకు చెందిన హోమ్ ఫర్ హీరోస్ సంస్థ మాత్రం ఎంతోకొంత విరాళం ఇచ్చి ఊరుకోలేదు. మంచి ఇంటిని గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంది. కెనడా ఆర్మీకి సేవలందించి ప్రస్తుతం నిరాశ్రయులుగా బతుకుతున్న వారికోసం హోమ్ ఫర్ హీరోస్ పేరుతో ఒక ఊరినే నిర్మించింది.. అది కూడా హైక్లాస్ ఫెసిలిటీస్ తో.. 

కెనడా శాంతి భద్రతల కోసం ఒకప్పుడు బార్డర్లో పోరాడిన హీరోలకు ఇప్పుడు తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేదు 3,500 మంది మాజీ ఉద్యోగులు ఇదే పరిస్థితిని ఎదు ర్కొంటున్నారు. దేశానికి సేవలందించిన వీళ్ళను ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో రోడ్లమీదే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. కనపడిన వాళ్లని సాయమడుగుతూ కడుపునింపుకుంటు న్నారు. దేశ సేవలో కాళ్లు చేతులు కోల్పోయిన వాళ్ల పరిస్థితి అయితే మురీ దారుణం. వీళ్ల పరిస్థితిని చూసి చలించిపోయింది హోమ్ ఫర్ హీరోస్ ఫౌండేషన్.

ALSO READ | జపాన్ లో భూత్ బంగ్లాలు.. టెక్నాలజీ ఎంత ఉంటే ఏంటీ.. లక్షల ఇళ్లు ఖాళీ

రోడ్లపై వాళ్ళ అవస్తలను చూసి ఏదైనా సాయం చేయాలనుకుంది. అన్ని వసతులుతో కూడిన ఇంటిని వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి దేశానికి చేసిన సేవకు కృతజ్ఙతలు చెప్పింది. మొత్తం 15 ఇళ్లతో ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వైఫై, కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయ్. అన్ని సౌకర్యాలతో కూడిన కిచెన్ కూడా అందుబాటులో ఉంది.

కౌన్సెలింగ్ సెంటర్స్:

యుద్ధంలో శారీరకంగా, మానసికంగా గాయపడి సోషల్ లైఫ్ కి అలవాటు పడలేకపోతున్నవారి కోసం గైడెన్స్ క్లాసెస్ కూడా నిర్వహిస్తోంది ఈ సంస్థ. మెంటల్ హెల్త్ సపోర్ట్, కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసింది. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కెరీర్ ట్రైనింగ్  పేరుతో వాళ్లలో ధైర్యాన్ని నింపి, ముందుకు నడిపిస్తోంది. అంతేకాదు.. రోజూవారీ అవసరాల కోసం సరుకులను కూడా వంపిస్తోంది.

మరిన్ని విలేజెస్:

ఒక్క గ్రామంతో మొదలైన హోమ్ ఫర్ హీరోస్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని గ్రామాలను నిర్మించనుందట. కెనడాలోని నిరాశ్రయులైన యుద్ధ వీరులందరికీ పునరావాసం కల్పించే ఆలోచనలో ఉందట. దేశం కోసం పోరాడినవాళ్లకి తమ వంతు సాయంగా ఈ సేవలు అందిస్తున్నాం అంటున్నారు హోమ్ ఫర్ హీరోస్ సంస్థ కో-ఫౌండర్ డేవిడ్.