పండుగొచ్చిందంటే చాలా ఇంటిని అందంగా డెకరేట్ చేస్తాం. లివింగ్ రూమ్ నుంచి బెడ్ రూమ్, హాల్ అన్ని గదులు కొత్తగా కనిపించాలి అనుకుంటారు. అది కూడా ఈజీగా, తక్కువ ఖర్చులో అయ్యే వస్తువులు కొంటాం.
అయితే, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్, నకాషీ ఆర్ట్ ఉన్న క్లాత్ వాడితే స్పెషల్ లుక్ వస్తుంది. తక్కువ బడ్జెట్ లోనే ఇంటికి కొత్త లుక్ తెచ్చేందుకు డిజైనర్ అశ్వినీ విద్యా గుప్తే చెబుతున్న కొన్ని ఐడియాలివి...
ఫ్యాబ్రిక్ ఫ్రేమ్స్..
రంగు రంగుల పూలు, రకరకాల బొమ్మలు, డిజైన్లు ఉన్న ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ని ఫ్రేమ్ కట్టించి గోడకి తగిలిస్తే లివింగ్ రూమ్ కొత్తగా కనిపిస్తుంది. వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఫ్రేమ్స్ బ్యాక్ డ్రాప్ గా బాగుంటాయి. వీటితో పాటు చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, పురాణ కథలకి సంబంధించిన బొమ్మలున్న క్లాత్ కూడా ఇంటికి రిచ్ లుక్ తెస్తాయి.
కుషన్ కవర్స్..
కుషన్ కవర్స్ ఎంత వెరైటీగా, స్టయిల్ గా ఉంటే సోఫాలు, ఆరాం కుర్చీలు అంత అందంగా కనిపిస్తాయి. అందుకోసం ఇక్కత్ డిజైన్ ఉన్న కుషన్ కవర్స్ ఎంచుకోవాలి. గుజరాత్ స్టయిల్ 'రోగన్ ఆర్ట్', 'మీనాకారీ' ఆర్ట్వర్క్ ఉన్న క్లాత్ కుషన్ కవర్స్ కూడా బాగుంటాయి. అలాగే, సీలింగ్కి ఫాక్స్ ఫ్యాబ్రిక్ తగిలిస్తే లుక్ అదిరిపోతుంది.
కర్టెన్స్..
లివింగ్ రూమ్ కలర్ ఫుల్ గా ఉండాలంటే టై అండ్ డై రకం బాందిని కర్టెన్స్ కొనాలి. తేలికగా ఉండే వీటి గుండా ఇంట్లోకి ఎక్కువ వెలుతురు వస్తుంది. వీటికి కాంబినేషన్ లైట్స్ ఉంటే గదంతా ఆహ్లాదకరంగా మారుతుంది.
వార్ డ్రోబ్..
ఇక్కత్ ప్రింట్స్ ఉన్నహోల్టర్స్ వాడితే వార్డ్రోబ్ అందంగా కనిపిస్తుంది. అలాగే కిచెనికి కూడా మంచి లుక్ తేవాలంటే యాక్సెసరీ హోల్డర్స్ ఏర్పాటు చేస్తే సరి.
Also Read :- వీకెండ్ హాలిడే రోజునే దీపావళి.. సెలవు పోయినట్టేనా..