Holi Special : రంగులాట మంచిదే.. పిల్లాపెద్దలకు కలిపే వేడుక

హోలీ ఎందుకు చేసుకుంటారు? దీనికి పురాణాల లెక్కలేనన్ని కథలు చెప్తారు. ఆ కథలేవీ తెలవకున్న పిల్లలకు, పెద్దోళ్లకు, వీళ్లకు, వాళ్లకు అని లేదు... హోలీ అంటే అందరికీ పెద్ద రంగుల పండుగ. పిల్లలైతే మూడు నాలుగు రోజుల ముందు నుంచే హోలీకి రెడీ అవుతుంటారు. రంగు ప్యాకెట్లు కొందామని, కలర్ గన్ తెచ్చి నీళ్లల రంగు కలిపి ఆడుదామని.. ఒక దగ్గర అప్పులు ఉండరు. పెద్దోళ్లకేమో దోస్తులను కలిసే టైమ్ ఇది. ఎక్కడో ఉండే దోస్తు కూడా ఇయ్యాల ఇంటి ముందుకొచ్చి రంగు ప్యాకెటు, గుద్దు చేతుల పట్టుకొని నవ్వుతూ. కనిపిస్తాడు. ఇంత నడుస్తది కాబట్టి ఈ రంగుల పండుగ చుట్టూ పాజిటివిటీ ఉంటది ఎప్పుడూ. రంగులు చల్లుకోవడంలో సంబురం ఉంటది. ఆ సంబురాన్ని దగ్గరికి తీసుకోవుడే హ్యాపీనెస్..

రంగు మంచిదే!

'మరక మంచిదే" అని చెప్పి సర్చ్ ఎక్సెల్ డిటర్జెంట్ పౌడర్ సూపర్ హిట్ అడ్వర్టయిజ్ మెంట్ లు చేసింది. అవన్నీ చూసే ఉంటరు కదా! హోలీ కోసం కూడా ఈ మధ్యే ఒక యాడ్ చేసింది సర్చ్ ఎక్సెల్. ఈ యార్డ్ లో ఒక చిన్నమ్మాయి వరుసగా అపార్ట్ మెంట్లు ఉండే ఏరియాలో సైకిల్ పై తిరుగుతుంటది. ఇప్పటికే ఆ ఏరియాలో పిల్లలంతా జోరుగా హోలీ ఆడుతుంటారు. ఆ చిన్నమ్మాయి నా మీద రంగు చల్లరా!' అనడుగుతది. పిల్లలంతా.. హుషారుగా రంగులు జల్లుతుంటారు. ఇంకా... ఇంకా.." అని వాళ్ల దగ్గర ఉన్న రంగులన్నీ అయిపోయేదాక వాళ్లను ఆడిస్తది. సరిగ్గా అప్పుడే ఒక ఇంటి దగ్గర ఆగి, వచ్చేసెయ్, అందరి దగ్గర రంగులు అయిపోయినయ్' అని పిలుస్తది.

ఆ ఇంట్లోంచి ఒక చిన్నన్నాయి. బయటికొస్తడు. ఆ అబ్బాయి ముగ్గ సమాజీకు పోవాలి. అతడ్నితన సైకిల్ మీద ఎక్కించుకొని మసీద్ దగ్గర దింపుత అమ్మాయి. 'నమాజ్ చేసాన' అంటాడు ఆ అబ్బాయి.' 'సరే, కానీ తిరిగొచ్చినంక మాత్రం నీకు రంగు పడుతది' అని నవ్వుతది ఆ అమ్మాయి, పిలగాడు 'సరే' అని నవ్వుకుంట మసీద్ లకు పోతడు. ఇది ఆ యాడ్ కథ. మనకిష్టమైన వాళ్లతో ఇష్టంగా రంగుల పండుగ చేసుకోవుడు మంచిదే అని చెప్పి యాడ్ ముగుస్తుంది అంతే. ఈ యాడ్ ఉన్నదని కాదు కానీ, మామూలుగా హోలీ పండుగంటేనే వీళ్లు వాళ్లు. అనే ఆలోచనలు లేకుండా పాజిటివ్ ఫీలింగ్ తో చేసుకునే పండుగ. అదే కదా హ్యాపీనెస్.

అందర్ని కలిపే హోలీ

అన్ని పండుగల లెక్కనే హోలీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే... ఈ పండుగ కూడా అందరినీ ఒక దగ్గరికి చేరుస్తది. ఎప్పుడో దూరమైన దోస్తులు కూడా హోలీ పండుగ వచ్చిందంటే కలుస్తుంటారు. ఒకే కాలనీల ఉండేటోళ్లు, ఒకే అపార్ట్మెంట్ ఉండేటోళ్లు.. అందరినీ ఒక దగ్గరికి చేర్చే పండుగ హోలీ మామూలుగా అయితే, గుడ్డు, టమాటలు నెత్తిమీద కొడుతుంటే ఆ వాసన ఎలాగో ఉండాలి గాని చాలామంది మనదగ్గర పండుగరోజు దీన్నొక సెలబ్రేషన్ లెక్కనే అనుకుంటారు. రంగులు మంచివి కావు, పర్యావరణానికి హాని చేస్తవి లాంటి మాటలన్నీ పక్కనబెట్టి చూస్తే, హోలీ ఒక పాజిటివ్ పండుగ, వయసుతో సంబంధం లేకుండా అందరికీ హ్యాపీనెస్ తెచ్చిపెట్టే పండుగ.

కాముడ్ని కాల్లుడు ఫేమస్

పిల్లలు హోలీ పండుగ సంబురాలను నాలుగు రోజుల ముందునుంచే మొదలు పెడుతరు. పండుగకు ముందు రోజు రాత్రి కాముడ్ని కాల్చడమన్నది సంప్రదాయం. కాముడ్ని దహనం చేయడమన్న ఆలో చనతోనే ఒక సంబురంగా హోలీ చేసుకుంటారు. అయితే పిల్లలకు తెలిసేది కాముడ్ని కాల్చడమన్న వనొక్కటే. ఇందుకోసం కాముడి బొమ్మను తయారుచేయాలి కాబట్టి పైసలు కావాలి. ఇంటింటికి తిరిగి వినాయక చవితికి చందాలు అడిగినట్టే కాముడ్ని కాల్బడానికి పైనలు అడుగుతరు. ఇట్ల పైనలు అడు గుతానికి కోలాటం కూడా ఆడుతారు.

రెండు చిన్న కర్రలు పట్టుకొని కోలాటం ఆడటం పిల్లలకు పెద్ద సెలబ్రేషన్. వాళ్లకు హోలీ మీద ఎగ్జయిట్మెంట్ వచ్చేది కూడా ఇప్పట్నించే ఒక హోలీ రోజైతే రంగుల ప్యాకెట్లు, బాటిళ్లల నింపుకున్న కలర్ నీళ్లతో పెద్ద పండుగ చేస్తరు పిల్లలు. వాళ్ల హ్యాపీనెస్ అది. కోడ్ గుడ్లు, టమాటలు నెత్తిమీద కొట్టడం కూడా వాళ్లకు సంతోషాన్నిచ్చే పనే.