బాసర ట్రిపుల్​ ఐటీకి ముగ్గురు స్టూడెంట్లు ఎంపిక

చొప్పదండి, వెలుగు: చొప్పదండిలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్​కు చెందిన ముగ్గురు స్టూడెంట్లు బాసర ట్రిపుల్​ ఐటీకి ఎంపికయ్యారని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం జె.శ్రీనివాస్​ తెలిపారు. ఇటీవల ఎస్సెస్సీ ఫలితాలలో 10 జీపీఏ సాధించిన ఎలిగేటి సవిత, గాలిపెల్లి అక్షిత, అనుమండ్ల నవీన ఎంపికయ్యారన్నారు. స్టూడెంట్లను హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంతోపాటు టీచర్లు మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్​, ముకుంద్​, అంజనీదేవి, తిరుపతి అభినందించారు.

మోడల్ స్కూల్ స్టూడెంట్..

మల్యాల, వెలుగు: మల్యాల మండలం నూకపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని సంజన బాసర ట్రిపుల్​ ఐటీలో సీటు సాధించినట్లు ప్రిన్సిపాల్ సరితాదేవి తెలిపారు. పోతారం గ్రామానికి చెందిన సంజన టెన్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9.7 జీపీఏ సాధించింది. సంజనను ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు టీచర్లు అభినందించారు.

కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలం సుద్దాల హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎర్రవెల్లి అక్షిత, లక్కం అక్షయ, కనగర్థి హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రుతిక,అక్షయ, మోడల్ స్కూల్ కు చెందిన ఒగ్గు వైశాలి, జె.వర్ష, ఎం.ఐశ్వర్యలు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ప్రిన్సిపాల్  సాగర్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలు మంజులాదేవి, వినోద్ కుమార్ అభినందించారు