గర్ల్స్ కోసం HMD నుంచి కొత్త బార్బీ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవ్..

నోకియా మాతృసంస్థ స్మార్ట్ ఫోన్ కంపెనీ HMD కొత్త బార్బీ ఫోన్ ని గ్లోబర్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇ ది ఒక క్లాసిక్ ఫ్లిప్ ఫోన్..దీన్ని బార్బీ థీమ్ తో డిజైన్ చేశారు. రెట్రో-స్టైల్ ఫ్లిప్‌తో పూర్తిగా పింక్ బాడీ, పింక్ బ్యాటరీ, పింక్ ఛార్జర్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 

తోపాటు రెండు ఎక్ట్రా బ్యాక్ కవర్లు, డైమండ్ స్టిక్కర్లతో కూడిన ప్రత్యేకమైన జ్యుయలరీ బాక్సులో వస్తోంది. ఇందులో హ్యాండ్ సెట్, బీడెడ్ లాన్‌యార్డ్స్, ఛార్మ్స్, రెండు అదనపు బ్యాక్ కవర్లు, స్టిక్కర్లు, జెమ్స్‌ను కూడా అందించారు. ఈ ఫ్లిప్ ఫోన్ ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే వైపు అద్దం కూడా బిగించారు. ఈ ఫోన్‌లో బీచ్ థీమ్డ్ మాలిబు స్నేక్ గేమ్‌ను అందించారు.

HMD బార్బీ ఫోన్ ధర:

దీని ధరను రూ.10వేల 800 గా నిర్ణయించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి సేల్ ప్రారంభం అవుతుంది. సింగిల్ పవర్ పింక్ కలర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సీ ఛార్జర్‌ను కూడా పింక్ కలర్‌లోనే అందించారు. ఇది మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

హెచ్ఎండీ బార్బీ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 

ఈ బార్బీఫోన్ లో 2.8 అంగుళాల QVGA మెయిన్ డిస్‌ప్లే, 1.77 అంగుళాల QQVGA కవర్ స్క్రీన్‌ను అందించారు. దీని ఔటర్ డిస్‌ప్లేను అద్దంగా ఉపయోగించుకోవచ్చు. యూనిసోక్ టీ107 ప్రాసెస ర్‌ పై ఈ ఫోన్ రన్ కానుంది. 64 MB RAM,128 MB స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 GBవరకు పెంచుకోవచ్చు. బార్బీ థీమ్డ్ యూఐపై పని చేసే S30 + ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ అవుతంది. 

ALSO READ | FM Radio channels: మోత మోగనున్న FM రేడియోలు..కొత్తగా 734 చానెల్స్..

HMD బార్బీ ఫోన్ కీప్యాడ్ ఐకానిక్ బార్బీ పింక్ షేడ్‌లో రానుంది. పామ్ ట్రీస్, హార్ట్ సింబల్స్, ఫ్లెమింగో డిజైన్స్‌ను కూడా చూడవచ్చు. ఫోన్ ఆన్ చేయగానే హాయ్ బార్బీ అని ప్రత్యేకమైన సౌండ్ వస్తుంది. బీచ్ థీమ్ మాలిబు స్నేక్ గేమ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.

కెమెరా.. 

కెమెరాల విషయానికి వస్తే ఇందులో 0.3 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంతోపాటు LED  ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. ఫోన్‌లో 1450 mAh రిమూవబుల్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే తొమ్మిది గంటల టాక్ టైమ్ అందించనుంది. 4AG, బ్లూటూత్ V5.0, 3.5 MM ఆడియో జాక్, USB టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.