Telangana Special : చేర్యాల మాస్క్.. మస్త్ ఫేమస్.. వెయ్యేళ్లుగా నడుస్తున్న నకాశీ చిత్ర కళ

చేర్యాల పేరు చెప్పగానే గుర్తొచ్చేది సకాశీ చిత్ర కళ. ఈ కళకు దేశ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలుసు. కళాకారులు పురాణ కథలు, ఇతిహాసాలను కళ్లకు కట్టినట్టు చూపించే పటాలతో పొటే మాస్క్ లు కూడా తయారు చేసేవాళ్లు. కొందరు కథకులు వాటిని పెట్టుకుని కథ చెప్పేవాళ్లు, దేవుళ్ల మాస్క్ లు స్టేజీపై పెట్టి పూజించేవాళ్లు. అయితే.. రాను రానూ సకాశీ పటాలతో పాటు ఈ మాస్క్ లకు కూడా డిమాండ్ తగ్గిపోయింది. అయినా చేర్యాలలో ఆ కళనే నమ్ముకుని బతుకుతోంది ఒక కుటుంబం. ప్రస్తుతం ఇంట్లో డెకరేట్ చేసుకునే విధంగా వాటిని తయారు చేస్తోంది.

సకాశీ చిత్ర కళకు పెట్టింది పేరు చేర్యాలు. కొన్ని సంవత్సరాల పాటు ఈ చిత్ర కళ జానపద కళలకు జీవం పోసింది. అప్పట్లో పాలకులకు, ప్రజలకు సామాజిక స్పృహను కలిగించిన కళల్లో ఇదీ ఒకటి. నకాశీ చిత్రకారులు ఆకి కులాల వాళ్లకు, పల్లెలోని కళాకారులకు పటాలను తయారు చేసి ఇచ్చేవాళ్లు పటం అంటే ఒక పురాణ కథను లేదా ఇతిహాసాన్ని బొమ్మల రూపంలో చెప్పడం. అందుకోసం ఒక పొడవైన బట్టపై కథలోని ముఖ్య ఘట్టాలను చిత్రీకరిస్తారు. ఆ బట్టను రోల్ చేస్తూ కథ చెప్తారు. అందుకే వీటిని రోలే పటాలు, సోల్ పెయింటింగ్స్ అని కూడా పిలిచేవాళ్లు. రాను రాను చేర్యాల పెయింటింగ్స్ గా పేరుగాంచాయి.

వీటితో పాటే పాత్రధారుల మాస్క్ లు కూడా తయారు చేసేవాళ్లు, వాటిని కళాకారులు ముఖానికి పెట్టుకుని కథ చెప్పేవారు. దేవుళ్లు, చిన్న సైజు ఆలయాల బొమ్మలను కూడా మాస్కుల్లా తయారు చేసే వాళ్లు నరాల కళాకారులు పల్లెల్లో కథలు చెప్పడం తగ్గడంతో కాటు కాశీ చిత్రాలకు, ఇటు మాస్క్ లకు గిరాకీ లేకుండా పోయింది. అయినా కళ వదులుకోలేక ఇప్పటికీ మార్క్ లను తయరు చేస్తోంది చేర్యాలలోని గణేశ్ కుటుంబం. కాకపోతే ఆ చేర్యాల మాస్క్ లకు ఆధునిక హంగులు అద్ది ఇంట్లో డెకరేట్ చేసుకునే విధంగా తయారు చేస్తున్నారు. 

కాకతీయుల నాటి కళ

సదాశీ చిత్రకళ కాకతీయుల కాలంలో 13వ శతాబ్దం నుంచే ఉంది. 17, 18 శతాబ్దాల్లో తెలంగాణను పాలించిన ముస్లిం రాజులు 'కాశీ' అని పేరు పెట్టింది కూడా వాళ్లే. ఇది ఒక ఉర్దూ పదం అప్పట్లో తెలంగాణలో అనేక ఆశ్రిత కులాలకు సకాశీ కళాకారులే రోల్ పటాలను, మాస్క్ ను తయారు చేసిచ్చేవాళ్లు. ముఖ్యంగా కాకి పడగల (ముదిరాజ్ ఆశ్రిత కులంకు మహాభారతం, విమాటోలు (గౌడ) చెప్పే కండము. మహేశ్వర పురాణం, పక్కలోళ్లు (మాదిగ) చెప్పే జాంబవంత పురాణం (ఆదిపురాణం) గుర్రపోళ్లు (మాలు) చెప్పే గుర్రపు మల్లయ్య పురాణం, అద్దపోళ్లు నాయీబ్రాహ్మణ) చెప్పే, ఇద్దపు పురాణం. కూనపులివాళ్లు (పద్యజాబీల) చెప్పీ భక్త మార్కండేయ పురాణం.. మండహెచ్చులు (గొల్ల) చెప్పే కాటను పురాణానికి సంబంధించిన రోలిపటాలు. మాస్క్ లు తయారు చేసేవాళ్లు. వాళ్లంతా రాత్రి కథ చెప్పి ఉదయాన్నే ఆ కులాల ఇళ్లకు వెళ్లి ధాన్యం, డబ్బు అడుక్కునేవారు. అలా ఆ కళను పోషించారు.. బతికించారు.

అంత ఈజీ కాదు :

మాస్క్ లను తయారు చేయడం అంత ఈజీ పనేం కాదు. ఎంతో శ్రమ పడితే కానీ బొమ్మ తయారు చేయలేరు. మాస్క్ చేయాలంటే మొదటగా సాంచ్(అచ్చు) తయారు చేయాలి. ఐదు రకాల సాంచాలుంటాయి. వాటిలో నాలుగు అంగుళాల నుంచి 40 అడుగుల వరకు కావాల్సిన సైజుల్లో చేసుకోవచ్చు. ఒక్కో సాండెతో వంద మాస్కులు తయారు చేస్తారు. సాంచె మీద కాగితాన్ని పెట్టి, దాని మీద చింతగింజల పిండి (ఉడకపెట్టింది), రంపపు పొట్టు మిశ్రమాన్ని మెత్తాలి. ఆ తర్వాత రెండు రోజులపాటు ఎండబెట్టాలి. తర్వాత మళ్ళీ అంచులను మెత్తి.. ఎండబెట్టి దాని మీద చింతగింజల పిండి, సుద్దమట్టి. గంజి కలిపి మెత్తాలి. ఇలా చేయడం వల్ల మాస్క్ లు సున్నగా అవుతాయి. ఆ తర్వాత వాటిని పూర్తిగా ఎండబెట్టి రంగులు పూస్తారు. ఈ రంగులు ఢిల్లీ. విజయవాడల్లోనే దొరుకుతాయి. 

పురాణాల మాస్క్ లు...

చేర్యాలలో ఇటీవల ఎక్కువగా పురాణాలు, ఇతిహాసాల్లోని క్యారెక్టర్ల మాస్కులు తయారు చేస్తున్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు, భరత, శతృఘ్నులు, హనుమంతుడు, రావణాసురుడు, విఘ్నేశ్వరుడు ఇలా రకరాల మాస్క్ లు ఎక్కువగా తయారు చేస్తున్నారు. కొన్ని జంతువుల బొమ్మలు, మాస్క్ లు కూడా తయారు చేస్తున్నారు. చేర్యాల మాస్క్ లకు ఎంతో గుర్తింపు వచ్చింది. గూగుల్, అమెజాన్ లలోనూ దొరుకుతున్నాయి. నకాశీ కళకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. దేశ, విదేశీ పర్యాటకులు, యువ డిజైనర్లు ఈ కళపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కళ అంతరించిపోకుండా ఉండాలంటే మరి కొంత మందికి నేర్పాల్పిన ఆవసరం ఉందని చేర్యాలలో మాస్కుల తయారీలో గుర్తింపు పొందిన గణేష్ కుటుంబం అంటోంది. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, మహారాష్ట్ర సహకారంతో కొంత మందికి ఈ కళలో ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెబుతోంది గణేశ్ కుటుంబం.