అమెరికాలో గెలిచేది ట్రంపే.. జోస్యం చెప్పిన థాయ్​లాండ్ హిప్పో

యూఎస్ ఎన్నికల్లో గెలిచేది డొనాల్డ్ ట్రంపేనని హిప్పో పొటమస్ జోస్యం చెప్పింది. థాయ్​లాండ్‎లోని ఓ జూలో ఉండే ఈ బుజ్జి హిప్పో పేరు మూ డెంగ్. నిర్వాహకులు దీనికి అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే టెస్ట్ పెట్టారు. ఓ గుమ్మడి పండును రెండుగా కోసి వాటిపై ట్రంప్, కమల పేర్లు రాశారు. వాటిని ఇంకొన్ని పండ్లతో అలంకరించి హిప్పో తిరిగే చోట ఉంచారు. నీళ్లలోంచి బయటకు వస్తూనే ఆ హిప్పో ట్రంప్ పేరున్న పండును ఆరగించేసింది. దీంతో ఎన్నికల్లో గెలవబోయేది ట్రంపేనని మూ డెంగ్ జోస్యం చెప్పిందంటూ మేనేజ్​మెంట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.