మనసులో కోరిక కోరుకుని దేవుడికి లంచం రూపంలో హుండిలో లక్షలు లక్షలు వేసే రోజులివి. మళ్ళీ ఆ కోరిక నెరవేరాలంటూ అప్లై చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా చేస్తే ఆ దేవుడు కనికరిస్తాడా? మీరు అడిగిన వరాలను సమకూరుస్తాడా?మరైతే మనం ఏం చేయాలి, ఇలా లక్షలు హుండీలో వేసే కన్నా దేవాలయంలో ఏం సమర్పిస్తే మీకు ఎలాంటి పుణ్యం లభిస్తుందో తెలుసుకుందాం. . .
మానవులకు కోర్కెలు ఉండటం సహజం.. కలియుగంలో మానవుల కోర్కెలు తీరేందుకే దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తుంటారు. ఈ మొక్కులు అనేక రూపాలుగా ఉంటాయి. ధనం.. ధాన్యం.. వస్తు రూపేణ ఉంటాయి. కొంతమంది దేవాలయాల్లో ఏర్పాటు చేసిన హుండీల్లో కానుకలు వేస్తుంటారు. అయితే నిజానికి హుండీల్లో కానుకలు వేయాలని .... హుండీలో డబ్బులు వెయ్యమని మన పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు, దాన ధర్మాలే చెయ్యమన్నారు.
మనం దేవాలయంలో ఏం సమర్పిస్తే ఏం పుణ్యం లభిస్తుందో విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం 341వ అధ్యాయం మనకు వివరిస్తుంది. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ వ్యవహారాలకు అందరూ సహకరిస్తేనే అది చక్కగా నిర్మాణం సంతరించుకుంటుంది.అందుకే ఎవరి చేతనైనంతలో వారు సమకూర్చుకోవాలి. దేవాలయాలకు సహాయ సహకారాలు అందిచాలని అంటున్నాయి పురాణాలు.
-
దేవాలయ గోడలకు సున్నం వేయడం లాంటివి అలాగే ప్రాగంణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి చేస్తే శ్రీమహావిష్ణువు లోకఫలాలను పొందుతారని పురణాలు చెప్తున్నాయి.
-
ఆలయానికి శంఖం లాంటివి దానం చేస్తే విష్ణువు పుణ్యలోక ప్రాప్తి కలుగజేస్తాడు. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తివంతులుగానే పుడతారు.
-
ఆలయానికి గంటను దానం చేస్తే మహ గొప్ప కీర్తివంతుడు అవుతాడు.
-
గజ్జెలను, మువ్వలను దానం చేస్తే సౌభాగ్యవంతులు అవుతారు.
-
ఆలయ ప్రాంగణంలో చల్లదనం కోసం పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందడానికి, ధర్మ బుద్ది కలగడానికి కారణమవుతాడు.
-
దేవాలయం పై రెపరెపలాడే జెండాలను దానం చేయువాడు సకల పాపాలనుండి విముక్తి పొందినవాడై వాయు లోకాలను పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చితే అంత యశస్సును దాత పొందుతాడు.
-
ఆలయ ప్రాంగణంలో వేదికలను నిర్మించడం వలన పృధ్వీపతి అవుతారు.
-
మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని పొందుతాడు.
-
నాలుగు కలశాలను దానం చేసిన వాడు 4 సముద్రాలంత పరియంతం ఉన్న, భూమి మీద అంత సుఖాన్ని పొందుతాడు.
-
కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందుతాడు.
-
వట్టి వేళ్ళతో తయారు చేసిన చాపలను ఇస్తే సర్వ పాపాలు నశించుకుపోతాయి.
-
ఆలయంలో ఉన్న గోమాతలకు గడ్డి, మరి అనేక రకాలైన సదుపాయాలను కల్పించిన వారికి పాపవిముక్తి కలుగును.
-
ధ్వజ స్థంభాన్ని సమర్పిస్తే లోకంలో గొప్ప కీర్తిని పొందుతాడు.
-
దేవునికి ముఖలేపనాన్ని అంటే సుగంధ ద్రవ్యాలను సమర్పించినవాడు ఉత్తమ రూప సంపదత్తిని పొందుతాడు