ట్రంప్​ గెలవాలని ఢిల్లీలో హోమం

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవాలంటూ ఢిల్లీలో హిందూ పూజారులు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ఆలయంలో సోమవారం పూజలు నిర్వహించిన స్వామి వేదమూర్తినంద సరస్వతి మాట్లాడుతూ.. ‘ప్రపంచ శాంతిని నెలకొల్పగల ఏకైక నాయకుడు డొనాల్డ్ ట్రంప్’ అని అన్నారు. హత్యాయత్నం తర్వాత ట్రంప్ కోసం జులైలో కూడా ఈ స్వామీజీ హోమం చేశారు.  యూఎస్‌‌‌‌లోని ఇండియన్లు,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను రక్షించే విషయంలో ట్రంప్‌‌‌‌కు ఉన్న నిబద్ధతే తాము పూజలు చేయడానికి, ఆయనకు మద్దతు ఇవ్వడానికి కారణమని వివరించారు.